News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కన్నాను బీజేపీ టార్గెట్ చేయబోతుందా- అందుకే ఈ నిర్ణయం తీసుకుందా?

గుంటూరు కేంద్రంగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయన్ని బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల24న గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం హాజరుకాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కోర్ కమిటి సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి గుంటూరును వేదికగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ అంశాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ, జిల్లాల వారీగా కమిటిల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జాతీయ నాయకత్వం నుంచి నేతలు కూడా హజరయ్యే అవకాశం ఉంది.

కన్నా టార్గెట్‌గా సమావేశం
గుంటూరుకు చెందిన కీలక నేత కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఇప్పడు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు గుంటూరులోనే సమావేశం కాబోతున్నారు. గుంటూరు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు, పార్టీ విస్తరణ, జిల్లాలో నూతన నాయకులను పార్టీలోకి చేర్చుకునే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 

కన్నా పార్టీని వీడిన తరువాత చాలా మంది నాయకులు పార్టీని వీడతారని భావించారు. అందుకు భిన్నంగా చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారందరికి భరోసా కల్పించటంటతో పాటుగా పార్టీని మరింతగా బలోపేతం చేసే విషయంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై క్లారిటి ఇచ్చే అవకాశం ఉంది.

బీజేపిలోకి తులసి రామచంద్ర ప్రభు
భారతీయ జనతా పార్టీలోకి కీలక నేతలు, పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని ప్రచారం నడుస్తోంది. తాజాగా గుంటూరుకు చెందిన తులసి సీడ్స్ అధినేత, పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ వి మురళీధరన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. కన్నా లక్ష్మి నారాయణపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

కన్నాకు చెక్ పెట్టేందుకుకే ....
గుంటూరు జిల్లా కేంద్రంగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడి హోదాలో పని చేసిన కన్నా ఆ తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరారు. దీంతో కాపు సామాజికవర్గం నుంచి కన్నా లక్ష్మినారాయణ, స్థానంలో తులసి రామ చంద్ర ప్రభును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కన్నా లక్ష్మినారాయణ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అదే స్దానంలో భారతీయ జనతా పార్టీ నుంచి తులసి రామ చంద్ర ప్రభు బరిలోకి దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. 

Published at : 21 Apr 2023 12:42 PM (IST) Tags: AP BJP Andhra Pradesh BJP Guntur News Kanna Lakshmi Narayana

ఇవి కూడా చూడండి

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Undavalli Arunkumar: స్కిల్‌ స్కామ్‌లో ఉండవల్లి పిల్‌ వేరే బెంచ్‌కు - ‘నాట్‌ బిఫోర్‌ మి’ అన్న న్యాయమూర్తి

Undavalli Arunkumar: స్కిల్‌ స్కామ్‌లో ఉండవల్లి పిల్‌ వేరే బెంచ్‌కు - ‘నాట్‌ బిఫోర్‌ మి’ అన్న న్యాయమూర్తి

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

CM Jagan: వైనాట్ 175 సాధ్యమే, త్వరలో రెండు కొత్త కార్యక్రమాలతో జనాల్లోకి - సీఎం జగన్

CM Jagan: వైనాట్ 175 సాధ్యమే, త్వరలో రెండు కొత్త కార్యక్రమాలతో జనాల్లోకి - సీఎం జగన్

టాప్ స్టోరీస్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !