Purandeswari On Narasimha rao: ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు- జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్- ఏపీ బీజేపీలో మరో వివాదం
బీజేపీలో కొత్త వివాదం చెలరేగింది. ఎన్టీఆర్, వైఎస్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన కామెంట్స్‌కు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు.
Purandeswari On Narasimha rao: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో కొత్త వివాదం రేగింది. ఇన్నాళ్లు కన్నా వర్సెస్ జీవీఎల్, సోమువీర్రాజుగా వార్ ఉండేది. దీంతో కన్నా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇది జరిగి ఒక్కరోజు కాక ముందే ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టింది.
కొన్ని రోజుల నుంచి కాపుల విషయంలో మాట్లాడుతున్న జీవీఎల్ తాజాగా చేసిన కామెంట్స్‌ను కాక రేపుతున్నాయి. నేరుగా ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పురంధేశ్వరి... అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు అనొద్దని.. ఆ మహానుభావులు అనాలంటూ సూచించారు.
ఏం జరిగిందంటే...
ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023
కాపులు ఆరాధ్యంగా భావించే వంగవీటి రంగా పేరుతో జిల్లా ఎందుకు పెట్టడం లేదంటూ కొన్ని రోజుల నుంచి జీవీఎల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడిన జీవీఎల్ ఎన్టీఆర్, వైఎస్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు రంగా పేరుతో జిల్లాను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు అంటూ సంబోధించారు. అన్నింటికా వాళ్ల పేరులే పెడుతున్నారని ఇతర నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
"అన్నీ ఇద్దరి పేర్లేనా"
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం-- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1
జీవీఎల్ కామెంట్స్‌పై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు అనడమేంటని ప్రశ్నించారు. ఆ ఇద్దరు... కాదు ఆ మహానుభావులు అనాలంటూ సూచించారు. అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లేనా అనే దానికి కూడా కౌంటర్ ఇచ్చారు పురంధేశ్వరి. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారని తెలిపారు పురంధేశ్వరి. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందించారని గుర్తు చేశారు. మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వివాదాలన్నీ జీవీఎల్, సోమువీర్రాజు చుట్టూనే నడుస్తున్నాయి. వాళ్లిద్దరు వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారని ఏం మాట్లాడినా, ఏం చేసినా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే చేస్తున్నారు తప్పా పార్టీ కోసం చేయడం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అందుకే చాలా మంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటకు చెప్పడం లేదంటున్నారు.
గురువారం పార్టీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఎప్పుడో పార్టీని విడిచిపెట్టిన బీఆర్‌ఎస్ నేత రావెల కిషోర్ బాబు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. వాళ్లిద్దరు ఉన్నంత వరకు పార్టీ ఎదిగే పరిస్థితి ఉండబోదన్నారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా జీవీఎల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్‌లు చేశారు. మరి బీజేపీ అధిష్ఠానం ఏం చేస్తుంది. దీనిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది. గతంలో కూడా జీవీఎల్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి.