అన్వేషించండి

Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

P Narayana: పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్నా క్యాంటీన్లను అప్పటికల్లా రెడీ చేయాలని ఆదేశించారు.

Anna Canteens in AP: రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ అన్నారు. సెప్టెంబర్ 21వ తేదీ నాటికి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మత్తులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి కావలసిన మరొక 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతోపాటు ఆహారం సరఫరా చేసేందుకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్ ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని సూచించారు. 

పురపాలక - పట్టణాభివృద్ధి శాఖలోని పలు విభాగాల శాఖాధిపతులు,సీనియర్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ సింఘాలతో కలిసి విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పలు కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

పట్టణాభివృద్ధి సంస్థల(అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్) కు  కీలక ఆదేశాలు

పట్టణాభివృద్ధి సంస్థల ఆర్థిక పరిస్థితుల గురించి వివరాలు తీసుకున్న మంత్రి నారాయణ... రెవిన్యూ పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు,డెవలపర్లు కచ్చితంగా నిబంధనలను పాటించేలా చూడాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేయాలని పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టర్ కు నారాయణ సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భవనాల అనుమతుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేఅవుట్ల అనుమతుల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై కమిటీ నియమించారు.

మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మెప్మా అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. పట్టణాల్లో మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే విధంగా వారి జీవనోపాధికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించవచ్చు అనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మెప్మా డైరెక్టర్ కు సూచించారు. 

నీటి సరఫరా, ట్రైన్లలో పూడికతీతపై సూచనలు

రోజువారీగా కాలువల డీసిల్టింగ్‌ను పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. సరైన క్లోరినేషన్‌ చేసిన తర్వాత తాగునీటి సరఫరా చేయాలని, మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.నీటి సరఫరా నమూనాలు ప్రతిరోజూ నాణ్యత కోసం పరీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget