అన్వేషించండి

Karumuri: ప్రతి గింజ కొంటాం, 12 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నాం - ఏపీ మంత్రి కారుమూరి

ప్రతి గింజా కొంటామని, నిబందనలు పాటించని 12 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నాం అని ఏపీ పౌరసఫరాల శాఖ మంత్రి కారుమూరి తెలిపారు.

వేసవి కాలంలో కురిసిన అకాల వర్షానికి తడిచిన ప్రతి గింజను సైతం ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రులు..
 కోసిన ధాన్యం కోసినట్లుగా కొనుగోలు చేసి, రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని, రైతులు ధైర్యంగా ఉండాలని ఉప ముఖ్య మంత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు.సత్యనారాయణ  అన్నారు.  తాడేపల్లిగుడెం మండలం నందమూరు, కృష్ణయ్య పాలెం గ్రామాలలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు తో కలసి ఉప ముఖ్య మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో వారు మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. పంటలు బాగా పండాయి ఏకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుమతి అవుతున్నాయి, సగం పైగా కోతలు అయ్యాయి. మిగతావి కోతలు అయ్యే లోపు అకాల వర్షాలు కురిశాయన్నారు. అయినా రైతులు కష్టం, నష్టానికి గురి కాకూడదనే ఉద్దేశంతో రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు నేరుగా బ్యాంక్ లో జమ చేస్తున్నామని జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కాలం కలసి రాకపోయినా ప్రభుత్వం అన్ని రకాలు ప్రయోజ నాలు కల్పించి, రైతులను ఆదుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రైతులకు ఇన్సూరెన్స్ చేశామని నష్టపోయినప్పుడు అదే నెలలో ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని అయన అన్నారు.
బాధ్యత లేని ప్రతిపక్షం....
ప్రతిపక్ష నాయకుడు నందమూరుకు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి, తన ఉనికి కోసమే ప్రయాస పడుతు న్నారని ఉప ముఖ్య మంత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రిగా పద్నాలుగు  సంవత్సరాలు చేసిన  కాలంలో ఏనాడైనా, ఏ సంవత్సరం అయినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఎటువంటి మేలు చేశారా అని మంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.  అకాల వర్షాలు పడినప్పటి నుంచి మంత్రులు, ప్రజాప్రతి నిధులు, జిల్లా అధికారులు రాత్రి అనక పగల అనక  క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను కలసి మాట్లాడి, ధైర్యం చెప్పి ధ్యానం కొనుగోలు పైనే ప్రధాన దృష్టి పెట్టామని అయన అన్నారు. మీరు వ్యవసాయం దండగ అన్నారు, మేము పండగ అని అందుకు అనుగుణంగా రైతుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి రైతన్నకు బాసటగా నిలిచామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం...
రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా, దళారీ వ్యవస్థ లేకుండా, రైతులకు, మిల్లులకు సంబంధం లేకుండా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ద్వారానే ప్రతి గింజను కొంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకి 850 కోట్లు చెల్లించామని, ఇంకా ఎంత కొనుగోలు చేసినా, చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆకుతీగ పాడు గ్రామంలో వ్యవసాయ శాఖ కమిషనర్, జిల్లా జాయింటు కలెక్టరుతో కలిసి పర్యటించామని ధాన్యం కొనుగోలు తర్వాత సకాలంలో డబ్బులు జమ అయ్యాయని రైతులు చెప్పారని మంత్రి అన్నారు. నందమూరుకు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆయన చెప్పే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఆయన హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఏటువంటి ప్రయోజనాలు రైతులకు కల్పించలేదన్నారు.

ఆనాడు కాల్దారి కాల్పులకు  ప్రతిపక్ష నాయకులు కారకులని, రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. రైతులు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లవలసిన అవసరం లేదన్నారు. అకాల వర్షంతో  రైతుల వద్ద  ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ఏవ్వరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నిబంధనకు వ్యతిరేకంగా నిర్వహించిన 12 రైస్ మిల్లులను సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. రైతులు  మంచి పంటలు వేసుకో వాలని మంచి దిగుబడులు రావాలని రైతులు ఆనందంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం అని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు రావు అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget