అన్వేషించండి

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

PNG Connections in AP | ఎల్పీజీ నుంచి పీఎన్జీ కనెక్షన్ల వైపు ప్రజలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపం పథకం కింద రూ.2400 అందిస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

AP PNG Connections | అమరావతి: అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడిచమురుతో పాటు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అవాంతరాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ల నుంచి పీఎన్‌జీ కనెక్షన్లకు మారేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా వారికి సబ్సిడీ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. PNG కనెక్షన్‌కు మారినప్పటికీ లబ్ధిదారులకు దీపం పథకం వర్తింపజేసి నగదు వారి ఖాతాల్లో రూ.2400 జమచేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పీఎన్‌జీ కనెక్షన్‌కు మారుతున్నందుకు కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ కూడా లభించనుంది. 

ఈ నగరాలపై స్పెకల్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులను పీఎన్జీ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ నగరాల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.


AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

దేవాలయాలు, అన్న క్యాంటీన్లకు ప్రాధాన్యత.. 24 గంటల్లోనే కనెక్షన్
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం దేవస్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు కూడా PNG కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఇందుకోసం 'ఆటోమేటిక్ పర్మిషన్ సిస్టమ్'ను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

పీఎన్జీ వినియోగదారులకు 'దీపం' సబ్సిడీ బెనిఫిట్స్
గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీని 5 శాతం నుండి 25 శాతానికి పెంచడం వల్లే పీఎన్జీపై ప్రజలు ఆసక్తి చూపలేదని మంత్రి నాదెండ్ల మనోహర్  విమర్శించారు. ఇకపై 'దీపం' పథకం కింద ఇచ్చే సబ్సిడీని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. PNG వినియోగదారులకు నిబంధనల మేరకు 2 నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సమానమైన రూ. 2400 నగదును పీఎన్జీ వినియోగదారుల ఖాతాల్లోకి డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 94 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. 

గ్యాస్ కొరత లేదు - వదంతులు నమ్మవద్దు
సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వదంతుల కారణంగా ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేయడంతో కొంత ఒత్తిడి పెరిగిందని, ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని ఆయన వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ కూడా పాల్గొన్నారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget