News
News
వీడియోలు ఆటలు
X

AP 10TH RESULTS 2023: పదో తరగతి ఫలితాలపై మంత్రి బొత్స ఏమన్నారంటే?

AP 10TH RESULTS 2023: ఈ సారి రికార్డు స్థాయిలో 18 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు బొత్స. ఇంగ్లీష్ మీడియంలో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

AP 10TH RESULTS 2023: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు. ఈ ఫలితాలపై బొత్స సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 3 నుంచి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈసారి ఆరు పేపర్లకే పరిమితం చేశామన్నారు.

రికార్డు స్థాయిలో ఎలాంటి వివాదాలు లేకుండా 18 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని పేర్కొన్నారు బొత్స. పరీక్షల్లో తప్పిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని బొత్స సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ ఏడాది వృథా కాకుండా సప్లిమెంటరీ పరీక్షలు పెట్టామని అందులో పాస్ అయ్యేలా ట్రై చేయాలన్నారు. ఒక ఏడాది పోయినా జీవితం చాలా ఉందన్నారు. ఒక ఓటమి గెలుపునకు పునాదిగా భావించాలని సూచించారు. విద్యార్థలను తల్లిదండ్రులు నిత్యం కాపాడుకుంటూ ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు. 

6,64,152 మంది రాసిన పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఆలంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకుంది. వాల్యుయేషన్ పక్కగా నిర్వహించామని చెబుతోంది. 

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతం గా ఉంది. 

జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. 

ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 

 పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
అక్కడ హోమ్‌ పేజ్‌లో ఏపీ 10Th రిజల్ట్స్‌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. 
వెంటనే వేరే పాపప్‌ ఓపెన్ అవుతుంది. 
అందులో మీ పదోతరగతి హాల్‌ టికెట్ నెంబర్‌్ టైప్ చేయాలి. 
తర్వాత కింద ఉన్న సబ్‌మిట్‌ బటన్ ప్రెస్‌ చేస్తే రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది. 
ఆ రిజల్ట్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

Published at : 06 May 2023 11:18 AM (IST) Tags: ABP Desam breaking news AP 10th Results 2023

సంబంధిత కథనాలు

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !