అన్వేషించండి

AP Liquor Sales: ఏపీలో తగ్గిన మద్యం అమ్మకాలు, కానీ ఆదాయం మాత్రం తగ్గేదేలేదు - పలు శాఖల సమీక్షలో సీఎం జగన్

AP Liquor Sales Income: ఆదాయాలను ఆర్జించే వివిధ ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

AP Liquor Sales: ఆదాయాలను ఆర్జించే వివిధ ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే సమయానికి  23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు. 

జీఎస్టీలో టాప్... 
ఆదాయాన్ని సమకూర్చే  శాఖలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వివిధ విభాగాల పని తీరును సమీక్షించిన ముఖ్యమంత్రి టార్గెలను అధిగమించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు.  విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పని తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకూ 91 శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్‌సేషన్‌ కాకుండా) పన్నుల వసూళ్లు, జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు నివేదికను సమర్పించారు. జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే సమయానికి  23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు వెల్లడించారు. 

మద్యం అమ్మకాలు...
గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు వెల్లడించారు. 
2018–19తో పోలిస్తే  మద్యం అమ్మకాలు తగ్గాయని, 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు, 
2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. 
2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతంగా నమెదయ్యిందని,  లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు.

నాటు సారా కట్టడికి చర్యలు తీసుకోండి.. జగన్
నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్బంగా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని సూచించారు.  ఆయా కుటుంబాలకు పునరావాస కార్యక్రమాల కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే సర్కార్ ఖర్చు చేసిందన్న విషయాలను కూడ ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పునరావాస కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని,  ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు. 

పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం...
గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ఈసందర్బంగా అదికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు, కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని నివేదికలో స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయని, అయితే వాటిని మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 5 వేల రిజిస్ట్రేషన్‌ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని, ఈ తరహా విధానాలను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. 

గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని , 2018–19లో శాఖ నుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. 2724 మైనింగ్‌ లీజుల్లో,  1555 చోట్ల తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. 

 ఏపీఎండీసీ ఆర్థిక పని తీరు గణణీయంగా మెరుగు పడిందని, 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు పెరిగిన ఆదాయం, పెరిగిందని వెల్లడించారు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీ ఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేసినట్లు అదికారులు చెబుతున్నారు. 
మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి భారీగా ఆదాయం ఆర్జిస్తున్న ఏపీఎండీసీ, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టామని వివరించారు. 

అప్పటికి ఇప్పటికి తేడా అదే.. 
గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలుకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని లెక్కలు చెబుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతంలో ఆదాయాల పరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతో పాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో  సాధ్యమైందని  అభిప్రాయపడ్డారు. రవాణా రంగంలో సంస్కరణల పై దృష్టి పెట్టాలని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల పై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరంస ఉందని, వాహనాల పై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget