అన్వేషించండి

Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

Andhra Pradesh News | రాజధాని అమరావతిలో పర్యటించిన వైసీపీ నేతలపై రైతులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ సమయంలో తలెత్తిన ఉద్రిక్తతలపై తాడేపల్లి పోలీసులు 3 కేసులు నమోదు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లున్నారని పోలీసులు గుర్తించారు.
  • పరస్పర ఫిర్యాదులతో మూడు వేర్వేరు కేసులు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం.
  • అమరావతి రైతులు వైసీపీ నేతలను అడ్డుకుని కోడిగుడ్లతో దాడిచేశారు.
  • ఈ దాడులను జగన్ ఖండించి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

Amaravati Tension | అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటనలో తలెత్తిన ఉద్రిక్తతల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారే ఈ పర్యటనలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన చైతన్య అనే వ్యక్తి నిన్న వైసీపీ నేతల వెంటే ఉన్నట్లు పోలీసులు  గుర్తించారు.  విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై జరిగిన దాడి కూడా ఆ బ్యాచ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు తొలుత రాళ్ల దాడికి దిగి రాజధాని రైతులను ఏమైనా రెచ్చగొట్టారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

రాజధానిలో ఉద్రిక్తత.. పరస్పరం ఫిర్యాదులు

అమరావతి: అమరావతిలో శనివారం నాడు వైసీపీ నేతల పర్యటనలో జరిగిన ఘర్షణకు సంబంధించి  తాడేపల్లి పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తాము రాజధాని ప్రాంతానికి వెళ్లినప్పుడు తమపై దాడి చేసి, కార్లను ధ్వంసం చేస్తూ హత్యాప్రయత్నానికి పాల్పడ్డారని వైసీపీ నేత నారాయణమూర్తి ఒక ఫిర్యాదు చేయగా.. తమ ప్రాంతానికి వచ్చి దౌర్జన్యంగా దాడి చేసి, కులం పేరుతో దూషించారని రాజధాని ప్రాంతానికి చెందిన ఒక ఎస్సీ మహిళ మరో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ తమను వ్యక్తిగతంగా దూషించారంటూ వైసీపీ నేతలపై తాడేపల్లి సీఐ ఫిర్యాదు చేశారు. నిన్నటి ఉద్రిక్తతల్లో విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తోసివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

అమరావతి పరిధిలో జరిగిన దాడులు, ఘర్షణలకు సంబంధించి పెనుమాకకు చెందిన మాణిక్యం అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు  అట్రాసిటీ కేసు నమోదుచేశారు. మరోవైపు, రాజధాని ప్రాంతానికి వెళ్లినప్పుడు తమపై దాడి చేసి, కారు అద్దాలు పగలగొట్టారంటూ వైసీపీ నేత నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అలాగే, విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని నెట్టివేసినందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీస్ 30 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

Also Read: YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్ 

వైసీపీ నేతల్ని అడ్డుకున్న అమరావతి రైతులు

అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు యత్నించిన వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. తమకు అన్యాయం చేసి ఇప్పుడు పర్యటనకు ఎందుకు వస్తున్నారని నిలదీయడంతో పాటు అడుగు ముందుకు వేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. వారిపై కోడిగుడ్లతో దాడి చేయగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు, ప్రత్యేక బలగాలు యత్నించాయి. అమరావతిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తోందా లేక గూండాల రాజ్యం సాగుతోందా అని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 

రాజధాని రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్తున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయించడం పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దౌర్జన్యాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్వయంగా ఈ దాడులను ఉసిగొల్పారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే దగ్గరుండి అరాచకాలకు కాపలా కాయడం, దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణమని జగన్ ధ్వజమెత్తారు. బాధితులకు తోడుగా నిలవడం తప్పా అని జగన్ ప్రశ్నించారు.

Frequently Asked Questions

అమరావతిలో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?

వైసీపీ నేతలు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పరస్పరం దాడులు జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

తాడేపల్లి పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేశారు. వీటిలో అట్రాసిటీ కేసు, వైసీపీ నేతల ఫిర్యాదు, సీఐ ఫిర్యాదులు ఉన్నాయి.

వైసీపీ నేతల పర్యటనలో దాడికి పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారని పోలీసులు గుర్తించారు?

గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీషీటర్లు పర్యటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. చైతన్య అనే వ్యక్తి ఈ దాడిలో ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ ఘర్షణకు సంబంధించి ఏయే ఫిర్యాదులు నమోదయ్యాయి?

వైసీపీ నేత నారాయణమూర్తి తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయగా, ఓ ఎస్సీ మహిళ కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని సీఐ కూడా ఫిర్యాదు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget