News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

బెలూన్‌లా ఉబ్బిపోతున్న అంగన్‌వాడి పాల ప్యాకెట్లు- సోషల్ మీడియాలో వీడియో వైరల్‌- జగన్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు

పసివాళ్లకు, బాలింతలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పాలు అందిస్తోంది. ఈ నెల పంపించిన పాలు బెలూన్‌లా ఉబ్బిపోతున్నాయి. దీనిపై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

FOLLOW US: 
Share:

తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పాల ప్యాకెట్లు బెలూన్‌లా ఇబ్బిపోతున్నాయి. వీటిని నిల్వచేసిన వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు ఏపీలో వైరల్‌గా మారుతున్నాయి. 

పసివాళ్లకు, బాలింతలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పాలు అందిస్తోంది. గత నెల వరకు టెట్రాప్యాకెట్లలో వచ్చే పాలు ఈనెల మాత్రం వేరే నార్మల్ ప్యాకెట్లలో వచ్చాయని అంగన్‌వాడి సిబ్బంది చెబుతున్నారు. 

ఈ ప్యాకెట్లు ఫ్రీడ్జ్‌లో పెట్టి చూస్తే బెలూన్‌ మాదిరిగా ఉబ్బిపోయాయని అందుకే వాటిని బయట పెట్టినట్టు ఆ వీడియోలో ఓ మహిళ చెబుతోంది. ఈ వీడియో షూట్ చేసింది ఎవరు, అందులో వాయిస్ ఎవరిది అనేది మాత్రం క్లారిటీ లేదు. 

కొత్తగా వచ్చిన పాల ప్యాకెట్లలో జగన్ బొమ్మ ఉంది. దీన్ని బట్టి ఇవి ప్రభుత్వ సరఫరా చేసినవిగా చెబుతున్నారు. ఇందులో కొన్ని ప్యాకెట్లు నార్మల్‌గా ఉన్నాయి. ఒకటి ఖాళీ ప్యాకెట్ కూడా ఉన్నట్టు వీడియోలోని వ్యక్తి చెబుతున్నారు. 

దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే" పసిపిల్లలకిచ్చే పాలనూ వదలవా సైకో జగన్! రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు. ఈనెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వతేదీవరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా...సరఫరా చేసిన రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది. అంటూ పోస్టు పెట్టారు. 

Published at : 30 Sep 2023 10:06 AM (IST) Tags: . Lokesh . Jagan Milk Packets

ఇవి కూడా చూడండి

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
×