అన్వేషించండి

Andhra Pradesh: యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?

YSRCP : ప్రత్యర్థులను డీమోరలైజ్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడే సోషల్ మీడియా బ్యాచ్‌కు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇందులో వైసీపీకి చెందిన బిగ్ హెడ్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియా పోస్టింగ్స్‌, అరెస్టులు షేక్ చేస్తున్నాయి. నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టింగ్స్ పెడుతున్న వాళ్లంతా సాధరణ కార్యకర్తలే అనే ప్రచారం సాగింది. కానీ ఇదంతా ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న వ్యవహారమంటూ పోలీసులు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి నెలకొంది. 

వర్రా రవీందర్‌రెడ్డి అనే వైసీపీ యాక్టివిస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు సహకరించిన మరో ముగ్గర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, లోకేష్‌, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌ షర్మిల, వైఎస్‌ వివేక కుమార్తె సునీత ఇలా అందరిపై అసభ్యకరమైన రీతిలో ఈ రవీందర్ పోస్టులు పెట్టాడు. వ్యక్తిగత హననానికి దిగుతూ వారిని సమాజంలో కించపరిచేలా సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడేవాడు. అలాంటి పోస్టింగ్‌లపై చాలా కాలం నుంచి కేసులు నమోదు అవుతున్నాయి. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల విచారణ వేగం పెరిగింది. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న వారికి చెక్ పెట్టేందుకు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలోకి లాగి కించపరుస్తున్న వారిని అరెస్టు చేయడం ప్రారంభించారు. అలానే చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న వర్రా రవీందర్ రెడ్డి బ్యాచ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. 

ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వర్రా రవీందర్‌రెడ్డిని మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అసభ్యకర పోస్టుల వెనుక వైసీపీ పెద్దల పాత్ర ఉందనే విషయాన్ని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ వెల్లడించారు. ఎవరిని ఎలా తిట్టాలి ఏం తిట్టాలనేది పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని వివరించారు. ఇప్పుడు ఇదే విషయం ఈ కేసులో కీలక మలుపుగా చెబుతున్నారు. 

వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయన పీఏగా ఉన్న బండి రాఘవరెడ్డి ద్వారా వీళ్లకు సమాచారం వచ్చేది అంటున్నారు. ఆయన డిక్టెట్ చేస్తేనే రాఘవరెడ్డి రాసుకొని వైసీపీ సోషల్ మీడియాకు పని చేసే వాళ్లకు పంపించేవారని తెలిపారు. ఈ విషయాన్ని వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు వివరించారు. 

అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతపై కూడా వర్రా రవీందర్ రెడ్డి ఇదే విధమైన అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియా వేదిగా దాడి చేశారు. ఇన్ని రోజులుగా తప్పించుకుంటున్న రవీందర్ రెడ్డిని ఆయనకు సహకరించిన సుబ్బారెడ్డి, ఉదయ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 

ఇప్పటి వరకు ఇదంతా వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహమో, జగన్‌పై ఉన్న అతి ప్రేమ కారణంగా ప్రత్యర్థులను దుర్భాషలాడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ పై స్థాయి నుంచే ఇదంతా అర్గ్‌నైజ్డ్‌గా జరుగుతోందని అప్పట్లో జడ్జిలపై దాడి నుంచి ఇప్పుడు జరుగుతున్న అటాక్ వరకు అంతా పక్కా ప్లాన్ ప్రకారమే అని పోలీసులు తేల్చారు. ఇలాంటి పోస్టింగ్‌లు పెట్టిన 45 మందిని కడప పోలీసులు గుర్తించారు. తాడేపల్లిలోని పీవీఆర్‌ ఐకాన్‌ బిల్డింగ్‌ మూడో అంతస్తులో ఓ ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకొని కాలకేయులు మాదిరిగా ప్రత్యర్థులపై కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు చిక్కిన నిందితులు 40 యూట్యూబ్‌ ఛానళ్లు, వందలకుపైగా సోషల్ మీడియా అకౌంట్లు వీరి ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. అన్నింటిల్లో కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేయడమే వీళ్ల పని.

ముందు రాష్ట్ర స్థాయిలో కంటెంట్ రెడీ చేసి జిల్లా స్థాయి కోఆర్డినేటర్లుకు పంపిస్తారు. అక్కడ వాళ్లు మండల, గ్రామస్థాయి శ్రేణులకు సెండ్ చేస్తారు. అక్కడి నుంచి వారు వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ప్రత్యర్థులపై చెలరేగిపోయి పోస్టులు పెట్టే వాళ్లు. వర్రా రవీందర్‌రెడ్డిపై వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ఓ కేసు నమోదైంది. ప్రొద్దుటూరులో మరో కేసు ఉంది.

వీళ్లంతా సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్‌లు చదవడానికే ఇబ్బందిగా ఉంటున్నాయని అన్నారు పోలీసులు. అలాంటి పోస్టింగ్‌లు పెట్టేందుకు ఓ వ్యవస్థనే నడిపారని అంటున్నారు. ఇందులో సజ్జల భార్గవరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డి అందరూ భాగమైఉన్నారని వివరించారు. ఇలా సోషల్ మీడియాలో విషం చిమ్మేందుకు ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇచ్చే వాళ్లని పేర్కొన్నారు. ఇప్పటికే సజ్జల భార్గవ్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన చిక్కితే మరిన్ని సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్‌ రెడ్డి మాత్రమే కాకుండా జగన్‌ సమీప బంధువు అర్జున్‌రెడ్డి పాత్ర కూడా ఇందులో ఉంది. వీళ్లే కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోరుకు అడ్డూఅదుపులేకుండా రెచ్చిపోయిన బ్యాచ్‌లపై కూడా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక ఆర్జీవీ, ఒక పోసాని కృష్ణమురళీ, శ్రీరెడ్డి, వాసుదేవ రెడ్డి, ఇంటూరు రవికిరణ్, పంచ్‌ ప్రభాకర్, వెంకటేశ్‌ బాడీ, బేతంపూడి నాని, కీసర రాజశేఖర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం అందరూ ఈ విషయవలయంలో భాగస్వాములుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వీరిలో కొందరిపై కేసులు రిజిస్టర్ చేశారు. సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై పోలీసులు సూమోటోగా కేసులు నమోదు చేయలేరని తమకు అందిన ఫిర్యాదుల మేరకు మాత్రమే యాక్షన్ తీసుకుంటామన్నారు. 

Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget