సోషల్ మీడియా యూజర్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్క పోస్టు జీవితాన్ని తలకిందులు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేసుల్లో ఇరుక్కుంటే జీవితాలు నాశనమైపోతాయని పోలీసుల హితవు . కేసుల్లో ఇరుక్కుంటే సొంత ఊరు దాటాలన్నా ఇబ్బందేనంటూ హెచ్చరిక చదువులు, ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లాలన్నా చిక్కులు తప్పవని వార్నింగ్ ఎక్కడకు వెళ్లాలన్నా పోలీసుల నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది కేసులు ఉన్న వాళ్లకు ఎన్‌వోసీ ఇవ్వడానికి పోలీసులు వెనుకంజ వేస్తారు కేసులు నమోదైన వ్యక్తులపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుంది. ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా పాత నేరస్తులపైనే అన్ని కళ్లూ ఉంటాయి. పోస్టులు పెట్టి తప్పించుకుంటే కన్నవాళ్లను, కుటుంబ సభ్యులు స్టేషన్‌లో కూర్చుంటారు