ఆంధ్రప్రదేశ్‌లో పేట్రేగిపోతున్న సోషల్ మీడియా కాలకేయులకు పోలీసులు చెక్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలని హెచ్చరిక పోస్టు పెట్టే ముందు అది ఎలాంటి సమాచారమో ఆలోచించాలని సూచన పోస్టు పెట్టడమే కాదు కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్త అంటున్నారు కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు, వీడియోలు పెడితే కేసులు తప్పవు అశ్లీల చిత్రాలు, మార్ఫింగ్ ఫొటోలు, హింసాత్మక వీడియోలు పోస్టు చేసినా షేర్ చేసినా నేరం తప్పుడు సమాచారం పోస్టు చేసినా, షేర్ చేసినా శిక్షలు తప్పవు కావాలని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే కామెంట్స్ చేయడం ప్రమాదకరం సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా ట్రోలింగ్ చేసినా నేరమే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టొద్దు ఆన్‌లైన్‌లో వేధింపులకు దిగడం, చట్ట విరుద్దమైన కార్యక్రమాలు చేయడం నేరం ఇతరల అనుమతి లేకుండా వారి సమాచారం ఫోన్ నెంబర్లు షేర్ చేయడం నేరమే గ్రూప్‌లో ఎలాంటి ఫేక్ ప్రచారం జరిగినా సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన తప్పుడు పోస్టులు పెడుతున్న వారి వివరాలు 112కి ఫోన్ చేసి ఇవ్వాలని హితవు అడ్మిన్‌లు అలర్ట్‌గా లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని పోలీసుల వార్నింగ్ . ముఖ్యమంత్రి సహా వివిధ ప్రముఖులను అవమానించే వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులకు భయపడి చాలా మంది గతంలో పెట్టిన పోస్టులు డిలీట్ చేస్తున్నారు.