By: Harish | Updated at : 18 Mar 2023 12:53 PM (IST)
వరుసగా 5వ రోజు అసెంబ్లి నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఐదో రోజు జరుగుతున్న అసెంబ్లి సమావేశాలు ఆరంభంలోనే తెలుగు దేశం నేతలు సభలో నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబందించిన అంశాలపై చర్చించాలని వాయిదా తీర్మానం అనుమతించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తొలుత ప్రతిపాదించారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగూపూడి, మంతెన రామరాజు, సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ, గద్దె రామ్మోహన్‌ను సస్పెండ్ చేయాలంటూ బుగ్గన సూచించారు. ఈ మేరకు స్పీకర్ వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడం ఇది వరుసగా అయిదోసారి.
క్వశ్చన్ అవర్ ప్రారంభం అయిన వెంటనే...
క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ సభ్యుల ప్రతిపాదన సభాసంప్రదాయాలకు విరుద్ధమని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సభాసమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనల గురించీ చర్చించాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల్లో కొందరు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి తమ ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. దీంతో ఈ విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ సభను కోరారు.
మండిపడ్డ బుగ్గన....
సభలో తెలుగు దేశం ఆందోళనల పై ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ సభాసమయాన్ని వృథా చేయడం సరికాదని సూచించారు. టీడీపీ సభ్యులు మాత్రం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు కారణం ఏంటో చెప్పాలని పట్టుబట్టారు. స్వప్రయోజనాలకా...రాష్ట్ర ప్రయోజనాల కోసమా... అంటూ తమ నిరసనను కొనసాగించారు. ఇలా సభలో గందరగోళం కొనసాగుతుండటంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించడం, స్పీకర్ ఆమోదముద్ర వేశారు.
అసెంబ్లిలో నిమ్మల నిరసన....
ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేసారంటూ ఎమ్మెల్యే నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డుతో అసెంబ్లీ వెలుపల బ్యానర్ ను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కట్టిన ఇళ్లకు రంగులు కాదు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలన్నారు. నాడు ఉచితమని చెప్పి, నేడు టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులను బ్యాంకులకు జగన్ తాకట్టు పెడుతున్నారని, నాలుగేళ్లలో అరబస్తా సిమెంట్ వాడకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల పై జగన్ కక్ష సాధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎమ్యెల్సీ విజయం పై సంబరాలు...
ఎమ్మెల్సీ స్దానాల్లో తెలుగు దేశం విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు సంబరాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న,నాగుల్ మీరా ఆధ్వర్యంలో బుద్దావెంకన్న ఇంటి వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రజప్రజావేదిక కోలగొట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయిందని, బుద్ధ వెంకన్న అన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్టికెట్లు ఎప్పటినుంచంటే?
Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్ పై దాడి, ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ కార్యకర్తలు!
AP Assembly : ఏపీ అసెంబ్లీలో కీలక తీర్మానాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చామన్న సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు
KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల