AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు
నేటి (సెప్టెంబరు 20) ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ఈ లైవ్ పేజీలో చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేయండి.
LIVE
Background
పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమలపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరిగింది. దీనిపై ముగింపు ప్రసంగం చేసిన సీఎం జగన్ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి వివరించారు. మూడేళ్లలో ఎలా మంచి జరిగిందో తెలిపారు. రాష్ట్రానికి వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్రం ముందుకొచ్చింది. పదహారు రాష్ట్రాలు పోటీ పడితే... ఒకటి హిమాచల్‌ప్రదేశ్, మరొకటి గుజరాత్, ఇంకొకటి ఏపీకి వచ్చిందని వివరించారు. అలాంటి పార్క్ వద్దని చంద్రబాబు, ఆయన పార్టీ లీడర్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. యనమల రామకృష్ణుడు రాసిన లేఖలను అసెంబ్లీలో డిస్‌ప్లే చేశారు. ఇలాంటి పనులు చేస్తున్న వారిని మనుషులేనా అని ప్రశ్నించారు. ఇదే ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు దివీస్ పరిశ్రమ పెట్టించేందు ప్రయత్నించారు. ఆనాడు కాలుష్యం గురించి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పూర్తిగా ఎలాంటి కాలుష్యం లేకుండా పైప్‌లైన్ వేసి ఎక్కడో వేరే ప్రాంతంలో విశాఖలో వేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెయ్యికోట్లతో ఏర్పాటు అయ్యే పార్క్‌ను ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వల్ల 30 వేల ఉద్యోగాలు రానున్నాయి.
తమకు ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణలో ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం మాట్లాడుతూ మాకెందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని అడుగుతున్నారు. పక్క రాష్ట్రాలు పోటీ పడి మాకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తుంటే.. అన్ని రాష్ట్రాలతోపోటీ పడి గెలిస్తే దాన్ని అడ్డుకునేందుకు శాయశక్తుల వీళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు జగన్. ఇలాంటి వాళ్లు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రమ రంగం గురించి రోజుకో దుష్ప్రచారం జరుగుతోందని వివరించారు. రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలన కంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని కాగ్ వివరించిందని వివరించారు సీఎం జగన్. ఫెవికల్ బంధానికి కంటే గట్టి బంధం దుష్టచతుష్టయం మధ్య ఉందని ఎద్దేవా చేశారు. వాళ్లది బాధ అయితే తమది బాధ్యత అని తెలిపారు.
పారిశ్రామిక ప్రగతి కూడా చంద్రబాబు పాలన కంటే తమ హయాంలోనే బాగుందన్నారు సీఎం జగన్. కరోనా టైంలో కూడా ఎఫ్‌డీఐ తగ్గిపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో బాగున్నాయని వివరించారు. పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో కూడా దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వందకు వంద మార్కులు వస్తున్నాయని వివరించారు. మారిన రూల్స్ ప్రకారం కూడా టాప్‌లో నిలిచామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు కంటే తాము వెళ్లి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎక్కువని ఉదహరించారు.
చంద్రబాబు హాయంలో తన వాళ్లు తనకు కాని వాళ్లు ఎవరని విభజించి చూసేపరిస్థితి ఉండేది. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఉండేదన్నారు. తాము మాత్రం ఉపాధి అవకాశాలు ఉన్న ఎంఎస్ఎంఈపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు. లక్షా ఇరవై వేల కంపెనీల్లో పెన్నెండు లక్షల మంది వీటిపై ఆధారపడి పని చేస్తున్నారు. రెండువేల 800 58కోట్లకు పైగా రాయితీలు ఇస్తే ఇందులో ఎంఎస్‌ఎంఈ రెండువేల ఐదువందల కోట్లు ఇచ్చాం. ఇందులో రెండువేల రెండు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో పడిన బకాయిలేనన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రాయితీలు వారి ఖాతాల్లో పడుతోందన్నారు.
గ్రనైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలను ప్రకటించామన్నారు. స్కిల్డ్ మేన్‌పవర్‌పై ఏ రాష్ట్రం దృష్టి పెట్టనంతగా ఫోకస్ చేశామన్నారు. స్థానికులకు 70శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశాం కాబట్టి దాని కోసం ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. నీళ్లు, విద్యుత్ కనెక్షన్ లాంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి సమస్యలేకుండా చేస్తున్నాం. ఇది చేయగలం ఇది చేయలేమని స్పష్టంగా చెప్పి ప్రభుత్వంలో సిన్సియారిటీని తీసుకొచ్చామన్నారు. దీని వల్ల పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ ఏర్పడిందన్నారు. ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని వాళ్లు ఏపీవైపు చూస్తున్నాం. బజాంకాలు బద్వేలులో పరిశ్రమ పెట్టారు, బంగరు, సింఘ్వీలు, బిర్లాలు, అదానీలు, రుయాలు ఇలా చాలామంది రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు.
పార్టనర్‌షిప్ సమ్మెట్‌లో చంద్రబాబు తీసుకొచ్చిన నకిలీ పారిశ్రామికవేత్తలు కారని ఎద్దేవా చేశారు. ఉపాధి అవకాశాల కోసం, రాష్ట్ర స్థూలఉత్పత్తి పెరుగుతుంది కాబట్టే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వీటిని మనసులో పెట్టుకొని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వీళ్లకు తోడుగా ఉండలేకపోతే వీళ్లంతా ఫెయిల్ అవుతారు. అప్పుడు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే వారికి చేదోడుగా నిలుస్తున్నాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఈఏడాది 97.89 శాతంతో మొదటి స్థానంలో వచ్చాం. కరోనా టైంలో కూడా నిర్వహించిన సర్వీస్‌కు దేశంలోనే నెంబర్‌వన్ వచ్చామన్నారు. 15రంగాల్లో 301 సంస్కరణలతో పారిశ్రామికవేత్తల అభిప్రాయంలో వందకు వంద శాతం మార్కులు సాధించామని వివరించారు. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలకు టాప్ అచీవర్స్‌గా ప్రకటించారని వివరించారు. ఇందులో ఏపీ మొదటి స్థానం ఉంటే గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, హరియానా, పంజాబ్, కర్ణాటక ఉన్నాయని సభకు తెలిపారు.
రాష్ట్రంలో గ్రోత్ రేట్ కూడా అదే స్థాయిలో ఉందని వివరించారు. 19 రాష్ట్రాలకు సంబంధించిన డేటా రిలీజ్ చేశారు. 11.43 శాతం వృద్ధిరేటులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడినట్టు తెలిపారు. రాష్ట్రంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఉత్పత్తి ప్రారంభించిన భారీ పరిశ్రమలు 99, వీటితోపాటు 35,181 చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు.
99 పరిశ్రమల్లో పెట్టుబడులు 46280 కోట్లు కాగా.. వాటి ద్వారా 62వేల 541 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినట్టు వివరించారు సీఎం జగన్. చిన్న మధ్యతరహా పరిశ్రమల ద్వారా 9742కోట్లు పెట్టుబడితో 211374 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 39, 655కోట్ల పెట్టుబడులతో మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి ద్వారా 78792 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మరో 91,129 కోట్ల పెట్టుబడితో 10 ప్రాజెక్టులతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి పూర్తైతే 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు చూస్తే... విశాఖ, కాకినాడ, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలో నాలుగు కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఇవి మరో లక్షా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులతో 72900 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
మూడేళ్లలో కరోనా ఏ స్థాయిలో ప్రపంచాన్ని వణికించిందో అందరికీ తెలిసిందే. అయినా ప్రభుత్వం చూపించిన చొరవతో రాష్ట్రంలో పరిశ్రామిక పెట్టుబడులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనతో పోల్చి చూస్తే మెరుగైనా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 41,280 కోట్ల రూపాయలు అంటే సగటున ఏటా 12వేల702కోట్లు వచ్చాయన్నారు. చంద్రబాబు హయాంలో 59వేల 968కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అంటే ఏటా సగటు 11వేల 994కోట్ల పెట్టుబడులు సమకూరాయని పేర్కొన్నారు.
బల్క్ డ్రగ్‌పార్క్ కాకినాడలో ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కోసం వెయ్యికోట్ల గ్రాంట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పరిశ్రమ పెడితే రకరకాల రాయితీలు ఇస్తారు. వైఎస్‌ఆర్ ఎలక్ర్టానిక్ మ్యానిప్యాక్చరింగ్ క్లస్టర్, అక్కడ మెగా ఇండస్ట్రీయల్ పార్క్ కొప్పర్తిలో వస్తున్నాయి. దీనికి పీఎల్‌ఐలో కేంద్రం చేర్చిందని వివరించారు. ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు తెచ్చుకోవచ్చన్నారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్‌లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి మూడు పార్క్‌లు వచ్చినట్టు వివరించారు. దీని వల్ల ట్రాన్స్‌పోర్ట్ రంగంలో మెరుగైన అభివృద్ధిచూస్తామన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడర్‌లు అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తున్నట్టు వివరించారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కోసం రెండు స్కిల్ యూనివర్సిటీలు, ముప్పై స్కిల్ పాలిషింగ్ కాలేజీలు పెడుతున్నామన్నారు. వీటితోపాటు ఒకేషనల్ కోర్సులను ఒకే గొడుగు కింద తీసుకొస్తున్నట్టు వివరించారు. 175 నియోజకవర్గాల్లో కాలేజీలు పెడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ సువిశాల తీరప్రాంతం కలిగి ఉందన్నారు. మరో రెండు చోట్ల పోర్టులను అభివృద్ధి చేశామన్నారు. వాటితోపాటు నెల్లూరులో రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, కాకినాడలో మరొకటి గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. వీటితో అనుసంధానంగా 9 ఫిషింగ్ హార్బర్లను కూడా పెట్టామన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో 555 మత్స్యకార గ్రామాల్లో ప్రజలు చేపల వేట ఆధారంగా జీవిస్తున్నారని గ్రహించి తీర ప్రాంతంలో 50 కిలోమీటర్‌కు హార్బర్ లేదా, పోర్టు ఉండేలా ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
3500 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణానికి ఆడుగులు వేస్తున్నామన్నారు. జువ్వలదిన్నె(నెల్లూరు), నిజాంపట్నం(బాపట్ల), మచిలీపట్నం(కృష్ణా), ఉప్పాడ(కాకినాడ)ను వచ్చే ఏడాది నాటికి 15500 కోట్లతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం జగన్. తర్వాత దశలో బియ్యపుతిప్ప, కొత్తపట్నం, పూడిమడక, బుడగట్లపాలెం ఓడరేవులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు విమానాశ్రయాలు ఉంటే... ప్రైవేటు భాగస్వామ్యంతో భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నామన్నారు. నెల్లూరులో కూడా ఎయిర్‌పోర్టు కట్టబోతున్నామన్నారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీనీ డెవలప్ చేస్తున్నామన్నారు.
ప్రైవేటు రంగంతో దీటుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూస్తే ప్రభుత్వ రంగంలో మూడు లక్షలపైచిలుక ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు జగన్. చంద్రబాబు హయాంలో 34వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వంలో యాడ్ అయ్యాయని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఆరువేల ఆరువందల 38 ఉద్యోగాలు యాడ్ చేశామన్నారు. వీటితోపాటు 37, 908 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 3,71,777 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మొత్తంగా ఆరు లక్షల 16వేల 323 ఉద్యోగాలను ఇచ్చామన్నారు. ఇందులో కేవలం వాలంటీర్లు మాత్రమే 1,25,110 మంది ఉన్నారన్నారు. ఆర్టీసీని విలీనం చేయడంతోపాటు వైద్యరంగంలో కూడా భారీగా ఖాళీలను భర్తీ చేశామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్‌లో ఉన్నవాళ్లను ఎంతగానో ప్రోత్సహించామన్నారు. వైఎస్‌ఆర్ వాహన మిత్రద్వారా రెండు లక్షల 74వేల కుటుంబాలకు, చేదోడు ద్వారా 2, 98, 428 కుటుంబాలు, నేతన్న నేస్తం ద్వారా 81, 783 ఫ్యామిలీలు, మత్స్యకార భరోసా ద్వారా 1, 19,875 ఫ్యామిలీలకు మేలు చేశామన్నారు. సివిల్ సప్లై చేసే వాహనాలు ద్వారా 18, 520మంది బతుకుతున్నారన్నారు. జగనన్న తోడు ద్వారా 15, 03, 358 మందికి సున్న వడ్డీకి లోన్లు ఇస్తున్నామన్నారు. కస్టమ్స్ హైరింగ్ సెంటర్‌ల ద్వారా 34, 580 మందికి ఉపాధి పొందుతున్నారు. వైఎస్ఆర్ చేయుత ద్వార 24, 95, 714 మంది, వైఎస్‌ఆర్ కాపు నేస్తం ద్వారా 3,38, 792 మందికి, ఈబీసీ నేస్తం ద్వారా 3, 92, 674 మందికి చేయూత ఇస్తున్నామన్నారు. అదే ఏపీ అభివృద్ధి కిటుకు అని జగన్ చెప్పారు.
TDP Leaders Suspension: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మొత్తం 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అంతకుముందు భూమన ప్రవేశపెట్టిన హౌస్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికకు సంబంధిన రిపోర్ట్ బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
Pegasus Report in AP Assembly: అసెంబ్లీలో పెగాసస్ నివేదిక, గత ప్రభుత్వం డేటా చౌర్యం చేసింది - భూమన
డేటా చౌర్యం అంశంపై మధ్యంతర నివేదికను మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించిందని తెలిపారు. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. డేటా చౌర్యం ఆరోపణలపై మార్చి 23న శాసనసభ ఒక సభా సంఘాన్ని వేసిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో 2016 నుంచి 2019 మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వం స్టేట్ డేటా సెంటర్ ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించారని తెలిపారు. తద్వారా వారు ప్రత్యేక లబ్ధి చేకూర్చుకున్నారని ఆరోపించారు. వివిధ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులతో డేటా చౌర్యంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 2018, 2019 మధ్య కాలంలో వాళ్ల ప్రైవేటు సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, టీడీపీ వారు ఏర్పాటు చేసిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా దాదాపు 30 లక్షలకు పైగా తమ ప్రభుత్వానికి వేయని ఓటర్ల ఓటు హక్కును రద్దు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి వ్యక్తుల డేటాను చౌర్యం చేసిందని ప్రాథమిక నిర్ధారణ జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Vidadala Rajini: విష జ్వరాల కట్టడికి ప్రత్యేక చర్యలు
నాలుగో రోజు అసెంబ్లీలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో విష జ్వరాల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేకంగా వైద్య అధికారులను నియమించామని అన్నారు. డెంగీ, మలేరియాను ఆరోగ్యశ్రీలో చేర్చామని గుర్తు చేశారు. ఇటీవల ఓ సంధ్య అనే చిన్నారి చనిపోయిన ఘటనను టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
AP Assembly: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభం, నేడు సభలోకి డేటా చౌర్యం నివేదిక
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. విద్యా, వైద్యం, నాడు - నేడుపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అంతేకాక, నేడు 85 పేజీలతో కూడిన పెగాసస్ నివేదిక కూడా నిర్దేశిత కమిటీ సభలో ప్రవేశపెట్టనుంది. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.