అన్వేషించండి

Amaravati pipe burning case: అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!

Amaravati : అమరావతి అగ్నిప్రమాద కేసులో పోలీసులు వాచ్‌మెన్ రామును అదుపులోకి తీసుకున్నారు. ఆయనే నిప్పు పెట్టినట్లుగా తేల్చారు.

Suspect arrested in Amaravati pipe burning case: రాజధాని అమరావతిలో సంచలనం సృష్టించిన వరుస అగ్నిప్రమాదాల కేసులో కీలక పురోగతి లభించింది. మేఘా ఇంజనీరింగ్ స్టాక్ యార్డ్‌లో పైపుల దగ్ధానికి కారణమైన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

అమరావతిలోని రాయపూడి సమీపంలో ఉన్న మెగా ఇంజనీరింగ్ స్టాక్ యార్డ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ రాత్రి నిల్వ ఉంచిన పీఎల్‌బీ  పైపులకు నిప్పు పెట్టింది అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్ రాము అని పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, ప్రాథమిక విచారణ అనంతరం రామును అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.                    

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా రామును విచారించారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి  సీన్ రీ-క్రియేట్ చేశారు. మంటలు ఎలా మొదలయ్యాయి, ఏ విధంగా వ్యాపించాయి అనే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించారు. ఈ పైపులు సాధారణంగా 130 నుండి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తప్ప మండిపోవని, కాబట్టి ఇది కచ్చితంగా మానవ ప్రేరేపిత చర్యేనని నిపుణులు తేల్చారు. నిందితుడు రాము స్వయంగా నిప్పు పెట్టాడా లేక దీని వెనుక ఎవరిదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

 *మంత్రి నారాయణపై చంద్రబాబు ఆగ్రహం 

మరోవైపు, అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం , భద్రతా సమీక్షలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ను ఆయన గట్టిగా ప్రశ్నించారు. రాజధానిలో వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నప్పుడు,  నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. 
 
ఇప్పటికే మూడుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినా మున్సిపల్ శాఖ నిమిత్తమాత్రంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.  స్టాక్ యార్డుల వద్ద కనీస భద్రత, సీసీటీవీ కెమెరాలు లేకపోవడంపై మంత్రిని నిలదీశారు. సంబంధం లేనట్లుగా కూర్చుంటే కుదరదని, అధికారులను సమన్వయం చేసుకుని విచారణ జరిపించాలని ఆదేశించారు.  రాజధాని పనులను అడ్డుకోవడానికి, ప్రభుత్వంపై అప్రతిష్ట తీసుకురావడానికి ఎవరో కావాలని చేస్తున్న విద్రోహ చర్యలుగా వీటిని అనుమానిస్తున్నట్లు సీఎం తెలిపారు.
 

ఈ ఘటనల నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో  హై-అలర్ట్  ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు 

1. రాజధాని అంతటా మరియు మెటీరియల్ యార్డుల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
2. పోలీసు పెట్రోలింగ్‌తో పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలి.
3. నిర్మాణ సంస్థలు తమ సొంత సెక్యూరిటీని పెంచుకోవాలని, భద్రతలో విఫలమైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రస్తుతం అరెస్టయిన రాము ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పోలీసులు 24 గంటల్లోగా తేల్చనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Vijayawada Mayor Election: కూటమికి ఊహించని షాక్.. విజయవాడ మేయర్ బరిలో ఏబీ వెంకటేశ్వరరావు.. ఎవరి ఓట్లు చీల్చుతారో!
కూటమికి ఊహించని షాక్.. విజయవాడ మేయర్ బరిలో ఏబీ వెంకటేశ్వరరావు.. ఎవరి ఓట్లు చీల్చుతారో!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget