అన్వేషించండి

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

Amaravati Latest News: మూడేళ్ల‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ అన్నారు. వ‌చ్చే మార్చి నాటికి ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

Amaravati Latest News: ఏపీ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని మూడేళ్ల‌లో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామ‌ని మంత్రి నారాయణ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. రాజ‌ధానిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను సీఆర్డీఏ ఇంజినీర్లతో క‌లిసి మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించారు. మంత్రులు,హైకోర్టు న్యాయ‌మూర్తులు,ముఖ్య కార్య‌ద‌ర్శులు,కార్య‌ద‌ర్శుల బంగ్లాల‌తోపాటు ఆలిండియా స‌ర్వీస్ అధికారుల క్వార్ట‌ర్ల నిర్మాణ ప‌నుల‌ను మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించారు.ఆయా నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ‌ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను వివ‌రాలు అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు.మొత్తం కార్మికులు ఎంత‌మంది ప‌నిచేస్తున్నారు? నిర్మాణ ప‌నుల‌కు ఉప‌యోగిస్తున్న సామాగ్రి,మెషిన‌రీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి పనుల ప్రోగ్రెస్ గురించి వివరించారు

"అమరావ‌తిలో భ‌వ‌నాలు,ట్రంక్ రోడ్లు,సీవ‌రేజి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎల్పీఎస్ లే అవుట్‌ల‌లో ప‌నుల‌కు కూడా టెండ‌ర్లు పూర్త‌య్యాయి. 2014-19 మ‌ధ్య‌లోనే అధికారుల కోసం 4000 ఇళ్ల నిర్మాణానికి టెండ‌ర్లు కూడా పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాం" అని మంత్రి చెప్పారు. అయితే గ‌త ప్ర‌భుత్వం అన్ని ప‌నుల‌ను నిలిపివేసింద‌న్నారు. తిరిగి పాత టెండ‌ర్లు ర‌ద్దు చేసి,న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుని కొత్త‌గా టెండ‌ర్లు పిలిచేందుకు ఆల‌స్య‌మైంద‌న్నారు. ప్ర‌స్తుతం రాజ‌ధానిలో అన్ని ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు.కొన్నిచోట్ల మాత్రం వ‌ర్షాల కార‌ణంగా కొంచెం ఇబ్బందులున్నాయ‌న్నారు.

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

వీటిలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ క్వార్ట‌ర్లు 12 ట‌వ‌ర్ల‌లో 288 ఫ్లాట్లు,ఆలిండియా స‌ర్వీస్ అధికారుల‌కు 6 ట‌వ‌ర్ల‌లో మొత్తం 144 ఫ్లాట్లు నిర్మిస్తున్నామ‌న్నారు. అలాగే ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీల కోసం 25 బంగళాలు,సెక్ర‌ట‌రీల కోసం 90 బంగ‌ళాలు, మంత్రుల కోసం 35 బంగ‌ళాలు,జడ్జిల కొర‌కు 36 బంగ‌ళాలు,నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ కొర‌కు మొత్తం 21 ట‌వ‌ర్ల‌లో 1968 ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. ఇక గెజిటెడ్ ఆఫీస‌ర్స్‌లో టైప్-1 అధికారుల కొర‌కు 4 ట‌వ‌ర్ల‌లో 384 ఫ్లాట్లు,టైప్-2 అధికారుల కొర‌కు 4 ట‌వ‌ర్ల‌లో 336 ఫ్లాట్లు,గ్రూప్ - డి ఉద్యోగుల కొర‌కు మొత్తం 6 ట‌వ‌ర్ల‌లో 720 ఫ్లాట్లు నిర్మిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.ఇక అమ‌రావ‌తిలోని హ్యాపీనెస్ట్ లో మొత్తం 6 ట‌వ‌ర్ల‌లో 1200 ఫ్లాట్లు నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఈ మొత్తం భ‌వ‌నాల్లో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఏఐఎస్ అధికారుల క్వార్ట‌ర్లు ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా పూర్తిచేస్తామ‌ని,ఇత‌ర నిర్మాణాల‌ను వ‌చ్చే ఏడాది మార్చి నెలాఖ‌రుకు పూర్తి చేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఐకానిక్ భ‌వ‌నాల నిర్మాణాలపై కాంట్రాక్ట్ సంస్థ‌ల ప్ర‌తినిధులు,డిజైన్ రూపొందించిన నార్మ‌న్ ఫోస్ట‌ర్స్ సంస్థ ప్ర‌తినిధుల మ‌ధ్య తుది చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు నారాయణ. త్వ‌ర‌లోనే ఐకానిక్ భ‌వ‌నాల నిర్మాణం కూడా ప్రారంభిస్తామ‌న్నారు మంత్రి.

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

డిసెంబ‌ర్ నాటికి మెజారిటీ ప్రైవేట్ సంస్థ‌ల నిర్మాణాలు ప్రారంభం
అమ‌రావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 72 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు స‌మావేశం ఏర్పాటుచేసి అగ్రిమెంట్ లు చేసుకున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఆయా సంస్థ‌ల్లో మెజారిటీ సంస్థ‌లు ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి నాటికి మెజారిటీ సంస్థ‌లు నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తాయ‌న్నారు. ఆయా సంస్థ‌లు నిర్ధేశిత కాలానుగుణంగా నిర్మాణాలు పూర్తిచేస్తాయ‌న్నారు. 

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

రెండో ద‌శ భూస‌మీక‌ర‌ణ‌పై కేబినెట్ స‌బ్ క‌మిటీలో చ‌ర్చిస్తాం

అమ‌రావ‌తిలో రెండో ద‌శ ల్యాండ్ పూలింగ్ పై కేబినెట్ స‌బ్ క‌మిటీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు.కేబినెట్ స‌బ్ క‌మిటీలో చ‌ర్చించారా అని గ‌త మంత్రివ‌ర్గ స‌మావేశంలో సీఎం ప్ర‌స్తావించార‌ని...అందుకే కేబినెట్ స‌బ్ క‌మిటీలో చ‌ర్చిస్తామ‌న్నారు.కేబినెట్ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం మేర‌కు వ‌చ్చే కేబినెట్ లో భూస‌మీక‌ర‌ణ‌పై నిర్ఱ‌యం తీసుకుంటామ‌న్నారు. 

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! 3 ఏళ్లలో పూర్తి రాజధాని పూర్తి, డిసెంబర్ నాటికి కీలక అప్డేట్స్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget