Pawan Kalyan Die-Hard Fan: పవన్ పేరు చెబితే చాలు, ఈ పెద్దాయనకు పూనకాలు లోడింగ్- ఇంతకీ ఎవరీయన!
Die Hard Fan of Pawan Kalyan: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ సీఎం కాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదంటున్నారు ఈ పెద్దాయన.
Die Hard Fan of Pawan Kalyan:
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూసి చనిపోవడమే తన జీవిత లక్ష్యం అంటున్నారు ఈ పెద్దాయన. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ సీఎం కాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదంటున్నారు. భవిష్యత్తు తరాలు బాగుడాలంటే పవన్ సీఎం కావడం చరిత్రాత్మక అవసరం అని అయన ఘంటాపథంగా చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ అంటే ఎందరికో పిచ్చి అభిమానం. పవన్ కనబడితే చాలు యువత కంట్రోల్ కోల్పోయి మరీ తమ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. పెద్దవారైతే పవన్ మీద ఎంత అభిమానం ఉన్న కంట్రోల్ కోల్పోకుండా హుదాగా వ్యవహరిస్తారు. కానీ ఈ పెద్దాయన అందుకు పూర్తిగా విరుద్దం. వీరాభిమానికి పవన్ కనబడితే పూనకాలే. యువకులు అయితే చేయలేనంతగా రచ్చ రచ్చ చేస్తారు. పవన్ మంగళగిరి పార్టీ ఆపీసులో ఉన్నారంటే ఈ పెద్దాయన సంతోషనికి అవధులు ఉండవు. ఇక ఆయన అక్కడే తిష్ట వేస్తారు. జనసేన పార్టీ ఆఫీసే తన సొంత ఇల్లుగా భావిస్తారు.
పవన్ కనిపిస్తే 17 ఏళ్ల యువకుడిగా మారతాడు..
తెనాలి మండలం కొలకులూరికి చెందిన గడ్డి గోపాలరావు జనసేనాని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. వయసు 70 ఏళ్లు. వయసు తన శరీరానికే కాని తన మనసుకు కాదని చెబుతారు. గోపాలరావు సమకాలికులు, కష్టంగా కాలం వెళ్లదీస్తుంటో గోపాలరావు మాత్రం పవన్, పవన్ అంటూ జనసైనికులకు పోటీ ఇస్తూ ఉంటారు. జనసేనాని మంగళగిరి వచ్చారంటే జన సైనికుల కంటే మందే పార్టీ ఆఫీస్ ముందు ప్రత్యక్షం అవుతారు. పవన్ పార్టీ ఆఫీసులో ప్రసంగిస్తున్నారు అంటే గోపాలరావు చేసే సందడి అంతా ఇంతా కాదు. పవన్ ఉన్నంత సేపు ఈయన 70 నుంచి 17 ఏళ్ల యువకుడిగా మారిపోతారు. జన సేన జండా చేత పూని నినాదాలు చేస్తు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈయనే చేసే సందడి పవన్ గమనించి గోపాలరావు కు కనెక్ట్ అయ్యారు. గోపాల రావును స్టేజీ పైకి పిలిచి అన్యాయంగా ఆలింగనం చేసుకున్నారు జనసేనాని. ఈ వయస్సులో కూడా ఆయన యువకులతో పోటీ పడుతూ చేస్తున్న సందడికి ఫిదా అయ్యారు పవన్. గోపాలరావు తన మనసుని గెలుచుకున్నారని చెప్పడంతో పెద్దాయని ఒక్కసారి వార్తలలో నిలిచారు. ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారారు గడ్డి గోపాలరావు.
పవన్ ను సీఎంగా చూడాలి..
పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానినని ఆ పెద్దాయన చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను జనసేనతో ప్రయాణం చేస్తున్నానని అంటున్నారు. పవన్ సీఎం కావడం రాష్ట్రానికి చారితాత్మక అవసరం అని చెబుతున్నారు. భవిష్యత్తు తరాల బాగుకోరే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపాలని. పవన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు పోతుందని బలంగా నమ్ముతున్నారు. పవన్ ను సీఎంగా చూసి చనిపోవడమే తన అంతిమ కోరికని... తనకు చేతనైన స్థాయిలో పార్టీ కోసం కష్టపడి పవన్ ను సీఎం చేసుకుంటామనంటూ గోపాలరావు స్పష్టం చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial