By: ABP Desam | Updated at : 29 Apr 2022 08:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు
AB Venkateswararao Meets CS : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సెక్రటేరియట్ కు వచ్చారు. యూనిఫాంలో వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ సమీర్‌శర్మను కలిశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తీసుకెళ్లానని ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌కు రిపోర్ట్ చేశానన్నారు. పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌ను కోరానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రెండేళ్లకు పైగా సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా్న్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ సచివాలయానికి వచ్చారు.
వివాదం ఏమిటి?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో నిబంధనలు అతిక్రమించారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం అభియోగాలు చేసింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ పనిచేశారు.
పరువు నష్టం దావా వేస్తానన్న ఏబీవీ
ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులకు ప్రభుత్వ సీపీఆర్వో చేసిన ప్రచారానికి సంబంధం లేదని తనపై దేశద్రోహం ఆరోపణలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఆయనకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తన సస్పెన్షన్ గడువు ముగిసిందని తనను విధుల్లోకి తీసుకుని పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో విధుల్లోకి తీసుకుంటారా లేక మరో నిర్ణయం ఏమైనా ఉంటుందా వేచి చూడాలి.
Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !
Breaking News Live Updates: కేబినెట్ నుంచి పంజాబ్ ఆరోగ్య మంత్రికి ఉద్వాసన
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్