News
News
వీడియోలు ఆటలు
X

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా చెల్లదంటున్నారు.

FOLLOW US: 
Share:

Amaravati News :  అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టులనూ లెక్క చేయడంలేదన్న విమర్శలు తాజాగా ఆర్ 5 జోన్ ఏర్పాటు  విషయంలో వస్తున్నాయి.   హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలు  చెప్పినప్పటికీ  అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేసన్​ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది  ప్రభుత్వం.  తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

గతంలోనే రాజధాని అవసరాలకుకాకుండా ఇతరులకు భూములు కేటాయించవద్దని హైకోర్టు ఆదేశాలు                 

ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది.   దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. అంతకు ముందే ప్రభుత్వ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. 

సీఆర్డీఏ చట్టం మార్చేసి ఆర్ 5 జో న్ఏ ర్పాటు చేసిన ప్రభుత్వం                     

అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసింది.గతంలో  సీఆర్డీఏ చట్టంలో నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి.  ఆర్‌-1 అంటే.. ప్రస్తుత గ్రామాలు,  ఆర్‌-2 అంటే తక్కువ సాంద్రత గృహాలు ,   ఆర్‌-3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు,  ఆర్‌-4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్ ఉండేవి. వీటికి అదనంగా ఐదో జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదోజోన్‌లో ్ కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది. ఇవన్నీ గతంలో కీలకమైన ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు కోసం కేటాయించిన భూములు.

ఈ ఉత్తర్వులు చెల్లవంటున్నరైతులు

సీఆర్డీఏ చట్టంలో ఎలాంటిమార్పులు చేయకూడదన్న కోర్టు తీర్పు ఉన్నా  సీఆర్‌డీఏ చట్టంలో సవరణలు చేసింది ప్రభుత్వం.  ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్‌డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల పేరుతో స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని భూములను టౌన్​షిప్​ల పేరుతో అమ్ముకోవటానికి, బదలాయించటానికి అధికారాలు సంక్రమిస్తాయి. అయితే దీనిపనా కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్5 జోన్ ఉత్తర్వులు చెల్లవని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. 

Published at : 22 Mar 2023 02:17 PM (IST) Tags: AP capital dispute Amaravati land dispute R5 zone formation

సంబంధిత కథనాలు

BJP Vs YSRCP: జగన్‌ పాలనపై జేపీ నడ్డా ఘాటు విమర్శలు  - వైఎస్ఆర్‌సీపీ నేతలు కౌంటర్ ఇవ్వగలరా ?

BJP Vs YSRCP: జగన్‌ పాలనపై జేపీ నడ్డా ఘాటు విమర్శలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు కౌంటర్ ఇవ్వగలరా ?

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Amit Shah Vizag Tour: నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Amit Shah Vizag Tour: నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Police Section 30 Act: పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు! 20 రోజుల పాటు అక్కడ సెక్షన్‌ 30 అమలు

Police Section 30 Act: పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు! 20 రోజుల పాటు అక్కడ సెక్షన్‌ 30 అమలు

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

టాప్ స్టోరీస్

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !