అన్వేషించండి

Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే

Hyderabad Chennai High Speed Rail Corridor: హైదరాబాద్ నుంచి చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌లో అమరావతికే తొలి ప్రాధాన్యమని తేలింది. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం అమరావతి మీదుగా నిర్ధారణ.
  • మూడు హైస్పీడ్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌లో 854 కి.మీ. విస్తరింపు.
  • పలమనేరు కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలో 11 కి.మీ. సొరంగం.
  • హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సర్వేలు త్వరగా పూర్తిచేయాలని అధికారులు కసరత్తు.

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం తెలిసిందే. అయితే ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌- అమరావతి- చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగానే నిర్మించనున్నారు. అమరావతికి సమీపం ఉన్న రావెల వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కానుండటంతో బుల్లెట్ రైలు ఎలైన్‌మెంట్‌ కూడా దానికి ఆనుకొని ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అయితే, విమానాశ్రయానికి ఆనుకొని కారిడార్ నిర్మిస్తే అది అమరావతి నగరంతో పాటు విజయవాడకు కూడా బాగా దూరమవుతుందని అధికారులు గుర్తించారు. దాంతో మొదట అనుకున్నట్లుగానే అమరావతి మీదుగానే ఈ హైస్పీడ్ రైలు కారిడార్ వెళ్లేలా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (FLS), డీపీఆర్‌ (DPR) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (NHSRCL)కు సూచించింది.

తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 760 కి.మీ కారిడార్
ఈ హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇందులో మొత్తం 18 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ పరిధిలో 180.32 కి.మీ. పొడవు ఉండే ఈ మార్గంలో హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద రైల్వే స్టేషన్లు రానున్నాయి. కారిడార్ సగాని కంటే ఎక్కువ దూరం ఏపీలోనే ఉంటుంది. అత్యధికంగా ఏపీలో 518.54 కి.మీ. మేర ఈ కారిడార్ ఉండనుండగా.. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి ఏపీలో మొదటి స్టేషన్‌ అవుతుంది. ఆ తర్వాత వరుసగా అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లను నిర్మిస్తారు. ఇక తమిళనాడులో కేవలం 61.23 కి.మీ మార్గంలో తిరువళ్లూరు, చెన్నై ఔటర్‌ రింగ్‌రోడ్‌/ మింజూర్, చెన్నై సెంట్రల్‌ స్టేషన్లు ఉంటాయి.


Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే

పలమనేరు అటవీ ప్రాంతంలో సొరంగ మార్గం
మరోవైపు, చెన్నై- బెంగళూరు కారిడార్‌లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడ పలమనేరు అటవీ ప్రాంతంలో 11.8 కి.మీ. మేర సొరంగ మార్గాన్ని (Tunnel) నిర్మించనున్నారు. చెన్నై-బెంగళూరు కారిడార్ మొత్తం 306 కి.మీ. పొడవుండగా, ఇందులో అత్యధికంగా తమిళనాడులో 133 కి.మీ, కర్ణాటకలో 101 కి.మీ, ఏపీలో 72 కి.మీ విస్తరించి ఉండనుంది. 

Also Read: Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఈ మార్గంలో ఏపీలోని చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక పరిధిలోని స్టేషన్లు కలిపి మొత్తం 7 స్టేషన్లు వస్తాయి. ఈ 2 ప్రధాన కారిడార్లను అనుసంధానిస్తూ తిరుపతి- చిత్తూరు మధ్య ప్రత్యేక లింక్ కారిడార్‌ను కూడా చంద్రబాబు సూచనల మేరకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ పరిశీలిస్తోంది.

ఏపీ మీదుగా వెళ్లనున్న మూడో కారిడార్ అయిన హైదరాబాద్‌- బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మార్గం అత్యధికంగా ఏపీలో 264 కి.మీ., తెలంగాణలో 239 కి.మీ, కర్ణాటకలో 94 కి.మీ. మేర ఉండనుంది. ఈ రూట్‌లో 3రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 స్టేషన్లు వచ్చేలా ప్రతిపాదించారు. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్ సహా 6 స్టేషన్లు రానుండగా.. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ వెళ్తుంది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేలు త్వరగా పూర్తిచేసి తుది నివేదికలు సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

Frequently Asked Questions

హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు ఎంత మరియు ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?

ఈ కారిడార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవునా వెళ్తుంది. ఇది అమరావతి మీదుగానే సాగుతుంది.

హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ స్టేషన్లు ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్‌లో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లను ప్రతిపాదించారు. కారిడార్‌లో 518.54 కి.మీ. ఏపీలోనే ఉంటుంది.

చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో సొరంగ మార్గం ఎక్కడ నిర్మిస్తున్నారు?

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా 11.8 కి.మీ. పొడవున సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?

ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దీని మొత్తం పొడవు 597 కిలోమీటర్లు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Breaking News: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget