అన్వేషించండి

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ ఉద్యమబాట పడుతున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు.

AP Agri Gold  :   ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని  సెప్టెంబర్ 6వ తేదీన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్రందన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.  అగ్రిగోల్డ్ ఖాతాదారులు చెమటోడ్చి పొదుపు చేసుకున్న నగదుతో యాజమాన్యం వేలకోట్ల ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్నారని బాధితుల తరపున పోరాడుతున్న నేతలు చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ సమస్య ఉందన్నారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై తలోమాట 

ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అగ్రిగోల్డ్ ఆస్తులు 36 వేల కోట్లు అని గతంలో ప్రకటించారని అగ్రిగోల్డ్ బాధితులు గుర్తు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రూ.20వేల కోట్లు మాత్రమే ఉందని చెప్తున్నారన్నారు. యాజమాన్యం మాత్రం రూ.2200 కోట్లు అని చెబుతూ ఖాతాదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 20వేల కోట్ల నుండి 2200 కోట్లకు మధ్య మిగిలిన రూ. 18 వేల కోట్లు  ఎవరిదో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  2017 మార్చి 23వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ.250 కోట్లు చెల్లిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మాసాలు గడిచినా మాట తప్పి మడమతిప్పి అగ్రిగోల్డ్ ఖాతాదారులను నట్టేట ముంచారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హామీ ఇచ్చి జగన్ మోసం చేశారంటున్న బాధితులు

సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2019లో రూ.240 కోట్లు చెల్లించి రూ.20వేల లోపు డిపాజిట్ దారులకు 120 రోజులలో నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు.  నేటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలకు రూ. లక్షా 67వేల కోట్లు చెల్లిస్తున్నామని ప్రకటించారని, రాష్ట్రంలోని 10 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు రూ.3040  కోట్లు ఎందుకు చెల్లించడం లేదని  ప్రశ్నించారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సమస్యలతో పాటు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పట్ల కూడా స్పందించి పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీన వేలాది మందితో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ప్రకటించారు. 

సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శన

సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శనను విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ బాధిత సంఘ నేతలు పిలుపునిచ్చారు.  అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.  కేవలం 20 శాతం మంది సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయని మిగిలిన 80 శాతం సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో గద్దె దించడానికి అగ్రిగోల్డ్ బాధితుల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.3 వేల కోట్లు బటన్ నొక్కి విడుదల చేయడానికి ఎవరు అడ్డుపడుతున్నారని  వారు ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
Embed widget