By: ABP Desam | Updated at : 21 Sep 2023 05:48 PM (IST)
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం - మరోసారి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు !
Chandrababu Case : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు.తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.
తనపై పెట్టిన కేసు అక్రమమని, చట్ట విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని .. రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం గం.12. నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ తర్వాత రెండున్నర గంటల తర్వాత నుంచి సాయంత్రం ఐదు వరకు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
సీఐడీ తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, సీఐడీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తోందని వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహాత్గీ వర్చువల్ పద్ధతిలో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, రెండున్నరేళ్ల పాటు పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తీర్పును రెండు రోజుల్లో ప్రకటిస్తామని జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గురువారం హైకోర్టు నుంచి తీర్పు వస్తుందని అనుకున్నారు. కానీ ఎలాంటి తీర్పు రాలేదు. క్వాష్ పిటిషన్‌పై జడ్జిమెంట్ 25వ తేదీకి వాయిదా పడినట్లుగా..ఓ న్యాయమూర్తి చెప్పారని ఎఎన్ఐ న్యూస్ ఎజెన్సీ చెప్పింది. అయితే దీనిపైనా స్పష్టత లేదు.
Andhra Pradesh High Court adjourns the quash petition of Chandra Babu to 25th September, says advocate Krishna Murthy
— ANI (@ANI) September 21, 2023
TDP chief and former CM Chandrababu Naidu was arrested in connection with the alleged skill development scam.
అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి వాయిదా సోమవారానికి వాయిదా వేస్తే.. కస్టడి పిటిషన్‌పై తీర్పును కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై దేశవ్యాప్తంగా న్యాయనిపుణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసు తీర్పు లో హైకోర్టు నిర్ణయం.. న్యాయపరంగా కూడా అనేక చర్చోపచర్చలకు కారణమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Andhra News : ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !
CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>