అన్వేషించండి

IPS Sanjay remand: ఐపీఎస్ సంజయ్‌కు రిమాండ్ - అవినీతి కేసులో సుప్రీం బెయిల్ రద్దు చేయడంతో జైలుకెళ్లిన అధికారి !

IPS officer Sanjay: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అవినీతి కేసులో ఆయనకు గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ACB court has remanded senior AP IPS officer Sanjay: ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి జైలు పాలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కీలక పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అవినీతి కేసుల్లో గతంలో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. బెయిల్ రద్దు చేసి మూడు వారాల్లో కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దాంతో ఆయన మంగళవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కోర్టు పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) 2024 డిసెంబర్ 24న సంజయ్‌పై అవినీతి నిరోధక చట్టం, 1988 మరియు భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.  ఈ ఆరోపణలు ఆధారంగా, సంజయ్‌పై విచారణ కొనసాగుతోంది.   ఐపీఎస్ అధికారి సంజయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ,  అడిషనల్ డైరెక్టర్ జనరల్ (సీఐడీ)గా పనిచేస్తున్న సమయంలో, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.  మొత్తం రూ. 1.76 కోట్ల విలువైన నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు తేల్చారు.  ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ నోసీ ఇంటిగ్రేషన్ (AGNI-NOC) వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియలో అవకతవకలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి.  సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 2.29 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, 2023 ఏప్రిల్ నాటికి కేవలం 14 శాతంపని మాత్రమే పూర్తయినట్లు  విచారణ కమిటీ నివేదిక పేర్కొంది. 

టెండర్ ప్రక్రియలో నిబంధనలు (GO నం. 94) ఉల్లంఘించడం, ప్రీ-క్వాలిఫికేషన్ బిడ్స్, సాంకేతిక అర్హత పరిశీలించకపోవడం  వంటి ఉల్లంఘనలకు సంజయ్ పాల్పడ్డారు. అలాగే  సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో, SC/ST (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్‌పై అవగాహన కార్యక్రమాల కోసం క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1.19 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కార్యక్రమాలు నిర్వహించబడలేదని, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉనికిలో లేదని యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) ఆరోపించింది. ఈ కార్యక్రమాలను సీఐడీ అధికారులు నిర్వహించారని, కేవలం రూ. 3.10 లక్షల ఖర్చుతో నిర్వహించినట్లుగా గుర్తించారు.  దీనివల్ల రూ. 1.15 కోట్లు  అక్రమంగా మళ్లించినట్లుగా గుర్తించారు. 
 
 AGNI యాప్ అమలు కోసం ఎనిమిది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 ,  రెండు యాపిల్ ఐప్యాడ్ ప్రో పరికరాలను ఈ-ప్రొక్యూర్మెంట్ లేదా పోటీ ధరల కొటేషన్లు లేకుండా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరికరాల కోసం సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ. 17.89 లక్షలు చెల్లించినట్లు, అధిక ధరలతో బిల్లులు లేకుండా చెల్లింపులు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది.   ఈ ఆరోపణల కారణంగా సంజయ్‌ను 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేశారు .  అతను విజయవాడలోనే ఉండాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని ఆదేశించబడింది.  అప్పట్నుంచి సస్పెన్షన్ లో ఉన్న ఆయన ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget