అన్వేషించండి
Advertisement
AP Waqf Board Chairman: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, ఏకగ్రీవంగా ఎన్నిక
Andhra Pradesh Waqf Board Chairman | ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవుడి ఆస్తులు కాపాడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు.
Chairman of Andhra Pradesh Waqf Board | అమరావతి: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయ్యారు. అనంతరం అబ్దుల్ హాజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవుడి ఆస్తులను కాపాడే బాధ్యత ఇస్తున్నాను జాగ్రత్తగా కాపాడు అని చంద్రబాబు చెప్పారు. వక్ఫ్ బోర్డ్ స్తంభించడం వల్ల అనేక రోజుల నుంచి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వంలో నూతన బోర్డుతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం’ అన్నారు.
విజయవాడ లోని వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎన్నిక కోసం మంగలవారం (డిసెంబర్ 17న) బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి బోర్డ్ సభ్యులలో ఒకరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియ వక్ఫ్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహణ అధ్యక్షత వహించి, ఎన్నికల ప్రక్రియ ను నిర్వహించారు. సభ్యులలో ఒకరైన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సగం భూములు కబ్జా అయ్యాయి: అబ్దుల్ అజీజ్
‘ఏపీ వక్ఫ్ బోర్డును పునర్నిర్మించిన ఏపీ సీఎం చంద్రబాబుపై గత ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ దేవుడి ఆస్తులు కాపాడే బోర్డుకు చంద్రబాబు జీవం పోశారు. వక్ఫ్ ఆస్తులను కాపాడటమే కాదు ఆదాయం సృష్టించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలి. వక్ఫ్ ఆస్తులను కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులు, వక్ఫ్ బోర్డ్ పైన ఉంది. దేవుడి ఆస్తులను కాపాడే బాధ్యత ఇచ్చాం. జాగ్రత్తగా కాపాడు అని చంద్రబాబు నాతో చెప్పారు. వక్ఫ్ బోర్డు చాలా రోజులపాటు స్తంభించడం వల్ల అనేక రోజుల నుంచి నిర్ణయాలు తీసుకోలేకపోయారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నూతన బోర్డుతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. వక్ బోర్డులో 60 వేల ఎకరాల భూమికిగాను 32 వేల ఎకరాలు కబ్జాకు గురైంది. అంటే మొత్తం భూమిలో 50 శాతం కన్నా ఎక్కువ కబ్జాకు గురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలతో పవిత్రమైన ఆలోచనలు చేసి వక్ఫ్ బోర్డులో అనేక సంస్కరణలు తీసుకువస్తాం’ అన్నారు వక్ఫ్ బోర్డ్ నూతన ఛైర్మన్ అబ్దుల్ అజీజ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion