(Source: ECI/ABP News/ABP Majha)
Top Headlines: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు - నటుడు అలీకీ నోటీసులు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని.. పోలవరాన్ని 2027 నాటికల్లా పూర్తిచేయాలని దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అసలు చిత్తశుద్ధి లేని పార్టీ వైఎస్సాఆర్‌సీపీ అని, 2014-19 లో 74 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం జరిగిందని, అయితే వైసీసీ పాలనలో గడచిన అయిదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నాశనమయ్యిందన్నారు. అయిదేళ్ల కాలంలో 3.8శాతం చేయించారు.. ఏ పని చేయకపోగా డయాఫ్రం వాల్‌ను పూర్తిగా నాశనం చేశారన్నారు. ఇంకా చదవండి.
2. ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి యువతతో పాటు పెద్దవారు సైతం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో, లేక అడిగిన ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదంటూ ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు చదువుతుంటాం. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి కొందరు, హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో విచిత్రంగా ఆర్టీసీ బస్సులోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంకా చదవండి.
3. అనంతపురంలో ఘోర ప్రమాదం
కూలికి వెళ్ళందే పూట గడవని కూలీలు. రోజు లాగానే చేతిలో సద్ది పట్టుకొని కూలి పని కోసం సొంత ఊరికి నుంచి మరో ఊరికి ఆటోలో వెళ్లారు. అరటి తోటలో తమ కూలి పని ముగించుకుని తిరిగి ఆటోలో తమ సొంతూరు కి బయలుదేరారు కూలీలు. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు ఆ కూలీలను కబలించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఐదు మంది అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గార్లదిన్నె మండలం తలగసిన పల్లె సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆటో అటుగా వస్తున్న లారీని బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఇంకా చదవండి.
4. టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు నోటీసులు జారీ అయ్యాయి. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోనీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఎక్మామిడి గ్రామపంచాయతీ సెక్రటరీ శోభారాణి నటుడు అలీకి నోటీసులు జారీ చేయగా, పనివారికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇంకా చదవండి.
5. నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి భయం
నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా మామడ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. మామడ రేంజ్ అధికారి రాథోడ్ అవినాష్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలు సేకరించారు. ఈ విషయమై ఏబిపి దేశం మామడ రేంజ్ అధికారి అవినాష్ తో ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి సంచారం వాస్తవమేనని వివరించారు. ఇది కవ్వాల్ అభయారణ్యం నుండి వచ్చిన పులి అని భావిస్తున్నారు. ఇంకా చదవండి.