By: ABP Desam | Updated at : 03 Dec 2022 01:54 PM (IST)
Edited By: jyothi
10 లక్షల మంది ప్రాణాలను కాపాడిన అంబులెన్సులు- ఏపీ ఆరోగ్య శాఖ 2022 నివేదిక!
AP 108 Ambulance Service: ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్ సర్వీసులు అద్భుతంగా ఉన్నాయని ఏపీ ఆరోగ్య శాఖ రిపోర్ట్ రెడీ చేసింది. ఈ ఏడాదిలో ఎలాంటి సర్వీస్ చేసింది... ఎంతమంది ప్రాణాలు కాపాడిందో ఈ రిపోర్ట్‌లో పొందుపరించింది. ఎలాంటి ప్రమాదం జరిగినా, ఏవైనా గాయాలు జరిగినా వెంటనే మనకు గుర్తొచ్చేవి,మ మనం ఫోన్ చేసేది అంబులెన్సులకే. అయితే గతంలో ప్రాణాపాయంలో ఉన్న వాళ్లు ఫోన్ చేసిన పావుగంట, అరగంటలోపే అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయి. మండలానికి ఒక అంబులెన్స్ ఇచ్చి నిరంతరం సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రాణాలును అంబులెన్సులు కాపాడాయి. ఏడాది పూర్తి కాకముందే 10 లక్షలకుపైగా జనాలు ప్రాణాలను కాపాడినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే వస్తున్న అంబులెన్సులు..
ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం... జనవరి నుంచి 10 లక్షల 10 వేల 383 ఎమర్జెన్సీ కేసులను 108 అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. గిరిజన ప్రాంతాల్లో కాల్ చేసిన అరగంటలోపే చేరుకుంటున్నాయి. 108 అంబులెన్సుల వ్యవస్థ పని తీరును విశ్లేషిస్తూ.. వైద్యారోగ్య శాఖ ఈ మేరకు నివేదిక రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 20 నిమిషాలలోపు 108 అంబులెన్సులు చేరుకోవాలనే నిబంధన విధించగా... 18 నుంచి 19 నిమిషాల్లోనే వస్తున్నాయట. పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల గడువు విధించగా ట్రాఫిక్ తదితర సమస్యల కారణంగా 15 నుంచి 18 నిమిషాల సమయం పడుతోందని నివేదికలో పేర్కొొంది. అత్యధికంగా 19 శాతం వరకు ఎమర్జెన్సీ కేసుల్లో గర్భిణులను 108 అంబులెన్సులు ప్రసవం కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 768 అంబులెన్సులు..
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 423 కొత్త అంబులెన్సులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్సులు పని చేస్తున్నాయి. ఇందులో బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, నవజాత శిశువుల అంబులెన్సులు తదితరాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఎమర్జెన్సీ కేసుల లిస్ట్‌ను ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో 93 వేల 451 మందిని, ఫిబ్రవరిలో 76 వేల 142 మందిని, మార్చిలో 88 వేల 775, ఏప్రిల్ లో 92, 337, మేలో 89 వేల 32, జూన్ 86 వేల 225, జులైలో 97 వేల 865, ఆగస్టులో 96 వేల 212 మంది, సెప్టెంబర్ 98 వేల 746 మంది, అక్టోబర్ నెలలో లక్షా 234 మంది, నవంబర్ 81 వేల 364 మందిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారని పేర్కొంది.
అయితే ఇందులోనూ 19 శాతం గర్భిణీ కేసులు కాగా, 16 శాతం కిడ్నీ డయాలసిస్, 13 శాతం ఇతర కేసులు, 9 శాతం మూత్రపిండ సమస్యలు, 8 శాతం శ్వాస సంబంధిత, 5 శాతం ప్రసూతి సంరక్షణ, 5 శాతం వాహనేతర గాయాలు, 4 శాతం పొత్తి కడుపు నొప్పి కేసులు, 4 శాతం గుండె సమస్యలు, మరో 4 శాతం ద్వరం, 3 శాతం అపస్మారక స్థితి కేసులు, 3 శాతం విష ప్రయోగం కేసులు , మరో రెండు శాతం పాము, కీటకాల కాటు కేసులు, 2 శాతం దాడులు, 2 శాతం ఫిట్స్ కేసులు, 1 శాతం డయాబెటిక్ కేసులు ఉన్నాయి.
Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్