అన్వేషించండి

YS Jagan: రైతు భరోసా ఇచ్చేదిలేదని చంద్రబాబు ఒప్పుకున్నారు: బకాయి లెక్కలు వెల్లడించిన జగన్

Andhra Pradesh News | దర్శిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా ఇచ్చేదిలేదని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

Annadata Sukhibhava Scheme 2025: తాడేపల్లి: తన హయాంలో రైతు భరోసా ఇచ్చేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్వయంగా నిజాన్ని ఒప్పుకున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు అంశాలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

1. ఎన్నికలకు ముందు అధికారం కోసం చంద్రబాబు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ ఇస్తారు, బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను గ్యారెంటీగా మోసం చేస్తారని ఈరోజు మరోసారి నిజమైంది. సూపర్‌-6, సూపర్‌-7 పేరిట ప్రజలకు చంద్రబాబు వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 

2. మా YSRCP హయాంలో అత్యంత సమర్థవంతంగా అమలుచేసిన రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Scheme) దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ, మీ ష్యూరిటీలు, మీ బాండ్లు మొత్తం మోసాలే. మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే. 

3. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి సభలో  మీ (చంద్రబాబు) నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా రాదన్నది ముమ్మాటికీ నిజమే.   

4. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలలలోనే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేకున్నా అక్టోబరు 2019లో రైతు భరోసా అమలు ప్రారంభించి 5 ఏళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్‌ ద్వారా తెలిపాం. మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు.  

5. వైసీపీ 2019 మేనిఫెస్టోలో 4ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేశాం. కానీ మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏడాది రూ.13,500 ఇచ్చాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించాం.

6. కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, ప్రతి ఏడాది రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారు. ఈ 2 సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటివరకు కేవలం రూ.5వేలు ఇచ్చారు. అది ఎంతమందికి వచ్చిందో తెలియదు. ఖరీఫ్ మొదలై 2 నెలలు గడిచినా పెట్టుబడి సాయం చేయకుండా రైతులను మళ్లీ వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు. 

7. వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు నిబంధనలతో సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి అన్యాయం చేశారు. వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని స్పష్టంగా కనిపిస్తోంది. దర్శిలో ఈ కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని రైతులు, రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

8. వైయస్సార్‌సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో,  మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మేం నిలబెడితే, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు. 

9. ఏపీలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మేం ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.7,800 కోట్లతో రైతులను ఆదుకున్నాం. మీరు దాన్ని రద్దుచేసి రైతులను గాలికొదిలేశారు. 

10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. 

11. అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లను వైసీపీ అందించి, రైతులను ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్‌ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తోంది. గత ఏడాది బీమా నగదు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .

12.ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ను, టెస్టింగ్‌ ల్యాబులను చంద్రబాబు నిర్వీర్యం చేశారు.

13. ఆర్బీకే(RBK)ల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మా హయాంలో అందిస్తే, మీరు మీ సిండికేట్‌ ముఠాలను ప్రోత్సహించి.. కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. 

14.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం’ అని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Embed widget