Gardening Tips : వాటర్ బాటిల్, సెలైన్ పైప్‌తో పుదీనా పెంపకం- స్థలం లేని వాళ్లకు చక్కని ఉపాయం
రోజూ ఫ్రెష్ పుదీనా కావాలనుకునే వాళ్లకు ఇదో మంచి చిట్కా. తక్కువ ఖర్చుతో స్థలం అవసరం లేకుండా పండించుకోవచ్చు.
చాలా మందికి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా రోజు మనం తినే ఆకుకూరలు, కూరగాయలు ఇంటి వద్ద పెంచుకోవాలని అనుకుంటారు. అయితే సరిపడా ప్లేస్ లేదని నిరాశ చెందుతుంటారు. కాస్త ఆలోచిస్తే మన రెగ్యులర్‌గా తినే వాటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు.
కావాల్సిన వస్తువులు:- రెండు వాటర్ బాటిల్స్, ఒక సెలైన్ పైప్, పుదీనా, మొక్కలు పెంచుకునేందుకు వీలుగా ఉండే మట్టి, తాడు,
మనం రెగ్యులర్‌గా వంటల్లో వాడే పుదీనాను ఎంచక్కా ఇంట్లోనే పండించుకోవచ్చు. దీనికి పెద్దగా ప్లేస్ అవసరం లేదు. ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు.
ముందుగా ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని మూత దిగువ భాగాన పెద్ద హోల్ పెట్టాలి. బాటిల్‌లో ఇసుకు వేసుకునేందుకు వీలుగా ఈ హోల్ ఉండాలి. తర్వాత బాటిల్ మొత్తం చిన్న చిన్న హోల్ల్స్ పెట్టాలి. మొక్కలు ఆ హోల్స్ నుంచి లోపలికి వెళ్లేలా ఉండాలి. క్యాప్ పైన కూడా పెద్ద హోల్ చేసి పెట్టుకోవాలి. బాటిల్‌కు సైజ్ కంటే రెండింతలు ఉండేలా ఓ ప్లాస్టిక్ పైప్ తీసుకొని దానికి కూడా హోల్స్ పెట్టాలి.
హోల్స్ చేసి రెడీగా పెట్టుకున్న పైప్‌ను ప్లాస్టిక్ బాటిల్ మూత రంధ్రం గుండా బాటిల్‌లో పెట్టాలి. ముందుగా చేసుకున్న పెద్ద హోల్ ద్వారా అందులో మట్టి వేయాలి.
ఇప్పుడు మనం బజారు నుంచి తెచ్చుకున్న పుదీనా నుంచి ఆకులు వేరు చేసి మిగిలిన కాడలను బాటిల్ చిన్న రంధ్రాల గుండా మట్టిలో నాటాలి. తర్వాత బాటిల్‌ను జాగ్రత్తగా తాడుతో వేలాడేలా కట్టేయాలి.
తర్వాత ఇంకో బాటిల్ తీసుకొని దాని కింది భాగాన్ని కట్ చేయాలి. పైన వేలాడేసేందుకు వీళ్లుగా హోల్స్ పెట్టుకోవాలి. దాన్ని వేలాడదీస్తే మూత ఉన్న భాగం కిందికి వస్తుంది. ఆ మూతకు హోల్ పెట్టుకొని సెలైన్ పైప్ తీసుకొచ్చి ఆ మూతకు ఫిట్ చేయాలి. సెలైన్ పైప్ రెండో భాగం... మొక్కలు ఉన్న బాటిల్ మూతకు పెట్టిన పైప్‌కు తగలించాలి.
ఇప్పుడు తలకిందులుగా వేలాడ దీసిన బాటిల్‌లో నీళ్లు పోస్తే మనం సెట్ చేసినట్టుగా చుక్కల మాదిరిగా మొక్కలు ఉన్న బాటిల్‌లోకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల పుదీనా మొక్కలకు రోజూ నీళ్లు పోయాల్సిన పని లేదు.
రెండు రోజుల తర్వాత చూస్తే మొక్కల్లో పెరుగుదల కనిపిస్తుంది. వారం రోజుల తర్వాత మనం పుదీనాను ఆకుల్ని కట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్లీ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పుదీనా కావాలనుకునే వాళ్లకు ఇది చక్కని ఉపాయం