By: ABP Desam | Updated at : 25 Sep 2022 03:59 PM (IST)
వ్యవసాయానికి ఉచిత విద్యుత్
- కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రం
- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు
- వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- 2014-15 నుండి 2021-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూపాయలు
- 36,890 కోట్ల సబ్సిడీని నాణ్యమైన విద్యుత్ కోసం అందించిన రాష్ట్ర ప్రభుత్వం
- 37,099 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థల పటిష్టం
Telangana Free Electricity: దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఎనిమిది సంవత్సరాలల్లో వ్యవసాయ స్వరూపం మారిపోయిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలో విద్యుత్ పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటును అందుబాటులోకి తెచ్చారు. 2018 జనవరి 1 నుండి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారని వెల్లడించారు.
సమాచార పౌర సంబంధాల శాఖ వెల్లడించిన వివరాలివే..
రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు విద్యుత్ ను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుండి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ పొందేలా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2014 నుండి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ లు విడుదలయ్యాయి. రైతన్ననికి ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయ రంగానికి 36.890 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం అందించింది.
గత 8 సంవత్సరాల లో అన్ని వర్గాలకు 37,099 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. 2014 నుండి సంవత్సరాలలో ట్రాన్స్‌కో ద్వారా 400 కే.వి సబ్ స్టేషన్లో 17, 200 కేవీ సబ్ స్టేషన్లు 48, 132 కెవి సబ్ స్టేషన్లు 72, ఈహెచ్ టి సబ్ స్టేషన్లు 137, 11107 CKM ఈ హెచ్ టి లైన్ , డిస్కంల ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ 1038 లు 3.65 లక్షల డిటిఆర్ లను నిర్మించి విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట పరచారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్
14160 మెగావాట్లు పిక్ డిమాండ్ ను కూడా చేరుకున్నాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం పరస్పర పనులను పవర్ హాలిడే ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్ తో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఉంటే 2021 నాటికి 2012 యూనిట్లుకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం అని తెలంగాణ పవర్ హౌస్ వివరాలు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2.47% అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98% ట్రాన్స్మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06% ఉన్న టి అండ్ డి నష్టాలను 11.01% తగ్గించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్ లో సామర్థ్యం 73 MW ఉంటే నేడు అది 4950 MW కు చేరింది. ఒకపక్క విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకుంటూ మరోపక్క సరఫరా పంపిణీ ప్రాధాన్యతనిస్తుంది.
రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెల 5, 96, 642 మంది ఎస్సీ వినియోగదారులకు, 3,21,736 మంది ఎస్టీ వినియోగదారులకు 2017 నుండి ఇప్పటివరకు 656 కోట్ల విలువగల విద్యుత్ను ఉచితంగా ఇచ్చారు. 29,365 నాయి బ్రాహ్మణుల సెలూన్ లకు 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. 6,667 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లూమ్స్ కు యూనిట్ కి రెండు రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ వెల్లడించారు.
సీమ కష్టాలు తెలిసే హంద్రీనీవా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేశాం: జగన్
Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర-ఎంతో తెలుసా??
Telangana grain 54 tenders: యాసంగి ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు-రేపు అర్హుల ఎంపిక
Crop Loans: తెలంగాణలో రైతులకు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు మొండిచేయి!
G20 Summit: దేశాధినేతల భాగస్వాములను ఆకట్టుకున్న మిల్లెట్ రంగోలి
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
COOKIES_POLICY
/body>