PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్! పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బులు ఎప్పుడంటే? లేటెస్ట్ అప్డేట్, చెక్ చేసుకోండి!
PM Kisan Samman Nidhi: పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు. బిహార్ పర్యటనలో కూడా ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు. డబ్బులు వేసినా ఇలాంటి రైతుల ఖాతాల్లో మాత్రం జమ కావు.

PM Kisan Samman Nidhi: కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం మరికొంత కాలం రైతులు ఎదురు చూడక తప్పదు. 20 విడత నిధులను జూన్‌లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. బిహార్ పర్యటనలో భాగంగా ఇవాళ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. సరే బిహార్ పర్యటనలో భాగంగా డబ్బులు ఎప్పుడు ఇస్తారో అనే విషయంపై ప్రధానమంత్రి క్లారిటీ ఇస్తారని అంతా భావించారు. అదీ జరగలేదు. అందుకే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులకు మేు చేయాలన్న ఉద్దేశంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా ఆరు వేల రూపాలు అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 19 విడతలుగా నిధులను విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంది. గత టెర్మ్ డబ్బులను ఫిబ్రవరిలో విడుదల చేసింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులు రిలీజ్ చేసే వాళ్లు. ఆ లెక్క ప్రకారం జూన్ మాసంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కావాల్సింది. కానీ ఇంత వరకు వేయలేదు.
మరి ఎప్పుడు వేస్తారు?
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం జులై నెలాఖరులో కానీ ఆగస్టు నెల మొదటి వారంలో కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అంటున్నారు.
ఇలాంటి రైతులకు నగదు రాదు
ప్రభుత్వం డబ్బు విడుదల చేసిన తర్వాత కూడా కొందరి ఖాతాల్లో నగదు పడవు. ఇలాంటి రైతులు 19 విడతలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి సమస్యలు మీకు కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక్కసారి చూడండి.
ప్రతి రైతు ఖాతాకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అయినా ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. వాటి ప్రకారమే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ఈ కింది రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావు.
- e-KYC ఇంకా చేయని రైతుల ఖాతాల్లో నగదు జమ కాదు.
- భూమి రికార్డులు ధృవీకరించకపోతే కూడా డబ్బులు రావు.
- దరఖాస్తు ఫారమ్‌లు అసంపూర్ణంగా ఉన్నా లేదా వాటిలో ఏదైనా లోపం ఉన్నా సరే నగదును ఆపేస్తారు.
పేరును ఇలా తనిఖీ చేయండి
- PM కిసాన్ సమ్మాన్ నిధి జాబితాలో పేరు ఉన్న రైతులకు మాత్రమే నగదు ఇస్తారు. మరి ఆ పేరును ఎలా చెక్ చేసుకోవాలి.
- ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కి వెళ్లండి.
- ఇప్పుడు హోమ్‌పేజీలోని రైతు కార్నర్ విభాగానికి వెళ్లండి.
- లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు ఇవ్వండి.
- దీని తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయండి.
- మీరు మీ పేరు, స్టాటస్, జాబితాలోని ప్రతిదాన్ని తనిఖీ చేయవచ్చు.





















