(Source: ECI/ABP News/ABP Majha)
Heaviest Strawberry: స్ట్రాబెర్రీతో వరల్డ్ రికార్డు సృష్టించిన ఇజ్రాయెల్ రైతు
ప్రముఖ ఫీట్-ట్రాకింగ్ సంస్థ ప్రకారం చెప్పిన వివరాల ప్రకారం 289 గ్రాముల బరువున్న పెద్ద స్ట్రాబెర్రీని ఇజ్రాయెల్ రైతు పండించాడు. ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా గిన్నిస్‌లోకి ఎక్కింది.
గిన్నీస్‌బుక్‌లో చోటు దక్కించుకున్న అతి పెద్ద స్ట్రాబెర్రీ ఇజ్రాయెల్‌లోని కడిమా-జోరాన్‌లో పండింది. ఇది 18 సెంటీమీటర్లు (ఏడు అంగుళాలు) పొడవు, నాలుగు సెంటీమీటర్ల మందం, చుట్టుకొలతలో 34 సెంటీమీటర్లు కలిగి ఉంది.
ఈ స్ట్రాబెర్రీ ఇలాన్ రకానికి చెందింది. దీన్ని నిర్దాయ్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ వ్యవసాయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది. నిర్దాయ్ సంస్థ బెర్రీలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ది. చల్లటి వాతావరణం కారణంగా ఈ సంవత్సరం స్ట్రాబెర్రీ సీజన్ ఆలస్యమైందని. దీని వల్ల చాలా బెర్రీలు కలిసి ఒక భారీ ఫ్రూట్‌గా మారిపోయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
And speaking of big strawberries, last week Ariel Chahi broke the Guinness World Record for the heaviest strawberry. pic.twitter.com/I7AGciEw1p
— Shay HaKohen | שי הכהן (@ShayHaKohen) February 17, 2022
స్ట్రాబెర్రీ పెరిగిన 45 రోజుల తర్వాత పండింది. .
ఈ స్ట్రాబెర్రీ పండించిన ఫ్యామిలీ ఈ సంవత్సరం నాలుగు భారీ స్ట్రాబెర్రీలను పెంచింది.వాటిలో ఒకటి మాత్రమే మునుపటి 250-గ్రాముల రికార్డును అధిగమించింది. 2015 జనవరి 28న జపాన్‌లోని ఫుకుయోకాలో నిర్దారించిన 250 గ్రాముల రికార్డును ఈ స్ట్రాబెర్రీ అదిగమించింది. .
స్ట్రాబెర్రీ రికార్డు ఉన్నట్టు శుక్రవారం గుర్తించామన్నారు రైతు సోదరులు. నాలుగు దశాబ్దాల పండ్ల సాగులో ఉన్న తాము చూసిన అతి పెద్ద స్ట్రాబెర్రీ ఇదేనంటున్నారు.
అందుకే శనివారం రాత్రే గిన్నిస్ వెబ్‌సైట్‌లో ఈ రికార్డు కోసం అప్లై చేశారు. పండు పరిమాణం, భరువు తగ్గిపోకుండా ఉండేందుకు తర్వాత రోజే అంటే శనివారం ఉదయమే పరశీలనకు రావాలని రిక్వస్ట్ పెట్టారు.
స్ట్రాబెర్రీని చూపిస్తూ వివరాలు చెబుతూ చిన్న వీడియోను రికార్డ్ చేసారు. స్ట్రాబెర్రీని ఐఫోన్ XRతో పోల్చారు. దాని కంటే అది సగం కంటే తక్కువ బరువు కలిగి ఉంది అని గిన్నీస్‌బుక్ వాళ్లకు చెప్పారు. "ఇది నమ్మలేని నిజం. సమాజంలో చాలా మంది మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది సమాజానికి గర్వకారణం" అని యెడిడ్ ఏరియల్ అన్నారు.
Watch :Israel లో పండిన సూపర్‌సైజ్డ్ Strawberry
Also Read: ఈ బీరు తాగితే ఫుల్ కిక్కు, కానీ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో అస్సలు పట్టుబడరు, కారణం ఇదే!