Non-Alcoholic Beer: ఈ బీరు తాగితే ఫుల్ కిక్కు, కానీ ‘డ్రంక్ అండ్ డ్రైవ్‌’లో అస్సలు పట్టుబడరు, కారణం ఇదే!

మార్కెట్లో బీరు పేరుతో నాన్-ఆల్కహాలిక్ బీర్లు అందుబాటులో ఉంటాయి. కానీ, అవి బీరు ఇచ్చేంత కిక్కు, రుచి ఇవ్వవు. పరిశోధకులు తయారు చేసిన ఈ బీరులో మీకు అవన్నీ దొరుకుతాయ్.

FOLLOW US: 

బీరు తాగితే కిక్కు ఎక్కుతుందనే సంగతి తెలిసిందే. ఎందుకంటే అందులో ఉండే ఆల్కహాల్ ఆ అనుభూతి ఇస్తుంది. అయితే, డెన్మార్క్ పరిశోధకులు తయారుచేసిన ఈ బీరు తాగితే.. కిక్కు ఎక్కుతుంది. కానీ, శరీరంలోకి ఆల్కహాల్ మాత్రం చేరదు. అదేంటీ అని అనుకుంటున్నారా? అదే ఆ బీరు ప్రత్యేకత. 

ప్రస్తుతం మార్కెట్లో ఆల్కహాల్ లేని బీర్లు ఉంటున్నాయి. కానీ, అవి పేరుకే బీర్లు. టేస్టు కూడా అంతగా బాగోదని మందుబాబులు అంటుంటారు. అందుకే, మధుప్రియులు ఆ బీర్లను ముట్టుకోరు. కేవలం మద్యం తాగుతున్నామనే ఫీల్ కలిగేందుకు కొందరు ఆ బీర్లు తాగి బొజ్జుంటారు. డెన్మార్క్ పరిశోధకులు తయారు చేసిన ‘ఆల్కహాల్-ఫ్రీ’ బీరు మాత్రం మద్యం ప్రియులను ఏ మాత్రం నిరుత్సాహానికి గురిచేయదట. అందులో ఆల్కహాల్ లేకున్నా.. మాంచి కిక్కు, రుచి రెండూ ఇస్తుందట. 

కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సోటిరియోస్ కంప్రానిస్ నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా ఈ బీరు తయారు చేశారు. హాప్స్ అనే పువ్వులో ఉండే మోనోటెర్పెనాయిడ్స్ అనే అణువుల సమూహాన్ని ఉత్పత్తి చేయడానికి సాక్రోరోమైసెస్ సెరెవిసియా అనే ఈస్ట్ జాతులను ఉపయోగించి ఈ బీర్ తయారు చేశారు. 

ఈ బీరులో ఆల్కహాల్ లేకపోయినా.. హాప్స్ నుంచి వచ్చే సువాసన ఆల్కహాల్‌ను తలపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ‘‘హాప్స్‌ను వేడి చేసేప్పుడు సువాసన కోల్పోతుంది. దానివల్ల ఆల్కహాల్‌ను కలిపి ఆ రుచి వచ్చేలా చేస్తారు. అందుకే, ఆల్కహాల్ కలపకుండా.. ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించాం.

Also Read: ఖి‘లేడీ’ కిల్లర్ - అమ్మాయిలను చంపేసి, శవాలతో కేకులు చేసుకుని తినేసింది, కారణం పెద్దదే! 

సంవత్సరాల పాటు సాగిన పరిశోధన తర్వాత, మోనోటెర్పెనాయిడ్స్ అని పిలువబడే చిన్న అణువుల సమూహాన్ని ఉత్పత్తి చేసే మార్గాన్ని తెలుసుకున్నాం. ఇవి హాపీ-ఫ్లేవర్‌ను అందిస్తాయి. బీర్‌ను తయారుచేసే ప్రక్రియ చివరిలో వీటిని కలపడం ద్వారా.. తిరిగి బీరులో ఉండే రుచిని తీసుకురాగలిగాం. ఇప్పటివరకు ఎవరూ ఇలా చేయలేకపోయారు. కాబట్టి.. ఈ బీర్ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కాబోతుంది’’ అని ప్రొఫెసర్ తెలిపారు.

Also Read: చీమలే దెయ్యాలా? ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. అసలు నిజం వేరే ఉంది!

హాప్స్ అంటే ఇవే..

Published at : 17 Feb 2022 07:22 PM (IST) Tags: Non-Alcoholic Beer Non-Alcoholic Beer Taste New Non-Alcoholic Beer University of Copenhagen University of Copenhagen Beer

సంబంధిత కథనాలు

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!