By: ABP Desam | Updated at : 13 May 2022 02:58 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వ్యవసాయాధారమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ తొలకరిపంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తీవ్రంగా నష్టపోతుంది. ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టాన్ని తుపాన్లు ఏటా హరించుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు పంటకాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో రైతుల నుంచి వినిపిస్తోంది.
సాధారణంగా ప్రతీ ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు నెల వరకు తుపాన్లు, భారీ వర్షాలు ఉంటాయి. ఖరీఫ్ పంట ఆలస్యం అవుతుండడంతో నవంబరు నెలాఖరుకు పంట చేతికందే పరిస్థితి ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రకృతి వైఫరీత్యాలు విరుచుకుపడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికందుతుందన్న తరుణంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు.
గడచిన 15 ఏళ్ల కాలంలో ఏ ఒక్క తొలకరి పంట పూర్తి స్థాయిలో రైతులకు చేతికందిన దాఖలాలు లేవనే రైతులు చెబుతున్నారు. తాజాగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ఇలాంటి సమస్య భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు తొలకరి పంటకు మందస్తుగానే నీళ్లు ఇవ్వాలని తీర్మానం చేశారు.
ఖరీఫ్ ముందుగా ప్రారంభం అవ్వడం వల్ల మూడు పంటల సాగుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. తుపాన్లు నుంచి పంటను కాపాడుకోవచ్చని, మూడో పంటలో పంట మార్పిడికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
మోహన్ కందా సిఫార్సు
తొలకరి పంట కాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఈ నాటిది కాకపోగా బ్రిటీష్ కాలం నాటి నల్లనీటి సాగు విధానం అమలు కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2011లో తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంకలో జరిపిన పంట విరామ(క్రాఫ్ హాలిడే) ఉద్యమం సందర్భంగా మోహన్ కందా కమిటీ పర్యటించి ప్రధానంగా ఈ సిఫారసు చేసింది. రైతులు ప్రకృతి వైఫరీత్యాల నుంచి తప్పించుకునేందుకు తప్పనిసరిగా పంట కాలపరిమితిలో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పంట కాలువల నిర్వహణలో మార్పులు చేసి రైతులకు ముందస్తుగా నీళ్లు ఇవ్వాలని సూచించింది.
అసలు బ్రిటీష్ కాలంనాటి నల్లనీటి సాగు అంటే ఏమిటి.?
బ్రిటీష్ కాలం నుంచి 1980 వరకు పంటకాల పరిమితి సక్రమంగానే నడిచింది. కాలక్రమేపి సాగు విధి విధానం పూర్తిగా గాడితప్పింది. గతంలో పంటకు మూలాధారమైన కాలువల వ్యవస్థను ఏటా ఏప్రిల్ 15న మూసివేసి మే 15 నాటికి విడుదల చేసేవారు. ఏప్రిల్ నెలలో కాలువలు మూసివేసే తరుణంలోనే నారుమడులు వేసుకునేవారు. మళ్లీ మే 15 నాటికి పంటకాలువల్లో నీరు విడుదల అయ్యే క్రమంలో నారుమడులు సిద్ధం అయ్యేవి. మళ్లీ పంట నీరు విడుదల అయ్యేనాటికి నారుమడులు సిద్ధమై జూన్ రెండో వారం నాటికే నాట్లు పూర్తి అయ్యేవి. ఏప్రిల్ నుంచి మే నెలలోపులోనే తొలకరి పంటకు నారుమడులు వేసే ప్రక్రియను నల్లనీటి సాగు అనేవారు. ఆగస్టు మాసంలో వర్షాలు విస్తారంగా కురిసినా అవి రైతులకు మేలు చేసేవి. అక్టోబరు నాటికి పంట చేతికందే దశకు చేరుకోగా సెప్టెంబర్ మెదటి వారంలోపు 99 శాతం కోతలు పూర్తయ్యేవి. మళ్లీ నవంబర్ నెలలో రబీ(దాళ్వా) పంటకు రైతులు సన్నద్ధమయ్యేవారు. ఇలా పంట కాల సమయం ముందుకు వెళ్లి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలు బయటపడేవారు.
ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నదేంటి..?
ప్రకృతి వైఫరీత్యాల నుంచి రైతులను గట్టెక్కించడంతోపాటు మూడు పంటలు వేసుకునేందుకు ముందస్తుగా సాగునీరు ఇవ్వడం వల్ల ప్రయోజనముంటుందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం స్పిల్ వే పూర్తి చేసి ఎగువ కాపర్ డ్యాంను నిర్మించడంతోపాటు అక్కడ నిల్వ ఉన్న నీటిని రివర్ స్లూయీజ్ గేట్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు ఇచ్చే తేదీలను కూడా నిర్ణయించారు. దీనిపై రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందస్తుగానే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని... ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలను గమనించగలిగిందని అభిప్రాయపడుతున్నారు.
Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్
YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !
Mango Fruits: మామిడి పండ్ల ను కొంటున్నారా ... అయితే ఇది మీకోసమే .. !
Southwest Monsoon: అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి వర్షాలు- గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ
Asani Cyclone: మరింత బలహీన పడిన అసని- రేపటికి వాయుగుండంగా మారిపోనున్న తుపాను
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్