అన్వేషించండి

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

Andhra Pradesh: కడుపు నింపే పంట కోసం కడుపునపుట్టిన బిడ్డలను కాడెడ్లుగా మార్చాడో రైతు. అనంతపురం రైతు కష్టాలు తెలియజేసే ఆ సీన్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Viral News: వ్యవసాయంపై మక్కువ ఆ రైతును నిలవనీయలేదు. ఆ స్థోమత లేకపోయినా బిడ్డల్నే కాడెద్దులుగా చేసి పొలంలో కలుపు మొక్కలు తీశాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్‌గా మారుతున్నాయి. బడికి పోవాల్సిన ఆ చిన్నారులు కాడెద్దులుగా మారిన ఘటన అనంతలో రైతులు పడుతున్న కష్టానికి ఉదాహరణగా చెబుతున్నారు. 

రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడటంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. పెరిగిపోయిన ఖర్చులకు తగిన ఆదాయం లేక చాలా మంది రైతులు తమ వద్ద ఉన్న ఎద్దులు, ఇతర సామాగ్రి అమ్మేశారు. కొందరు పొలాలను కూడా వదిలించుకున్నారు. కానీ మరికొందరు భూమిపై ఉన్న మక్కువతో ఖర్చులు సాగును మాత్రం కొనసాగిస్తున్నారు. అలాంటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

ప్రస్తుత కాలంలో రైతులకు వ్యవసాయం గుదిబండల మారింది. వర్షాలు వచ్చాయంటే చాలు రైతులు ఎన్నో ఆశలతో పొలాల్లో సాగుకు సిద్ధమవుతారు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ ఖర్చులు అధికం అవుతుండడం రైతులకు భారంగా మారుతుంది. విత్తనం వేసుకోవడానికి ముందుగా తమ పొలాలలో సేద్యం, కలుపులు తీసుకోవడం కూలీల ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే  వర్షం ఇచ్చిన ఆనందం కంటే సాగు ఖర్చులు తలచుకొని భయపడాల్సి వస్తుంది. 

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

ఇప్పుడు మన చూసిన ఈ ఫొటోలు అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో శార్దానప్ప అనే రైతు తన పొలంలోనిది.  టమాటో పంట సాగు చేసే శార్దానప్ప ఈసారి కూడా పంట వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలంలో కలుపు మొక్కలు పెరిగాయి. 

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలను పురమాయించాలి. దానికి చాలా ఖర్చు చేయాలి. దున్నించాలి అంటే ఎద్దులు లేకపోయే. వేరే వాళ్లకు చెబితే బాడుగ ఎక్కువ ఇవ్వాలి. ఎద్దులు కొనే స్తోమలేని రైతు కుటుంబం సాయం తీసుకున్నాడు. 

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

ట్రాక్టర్‌తో సేద్యం చేయించాలంటే కూడా ఖర్చు మేపెడు అవుతుంది. పొలాన్ని వదిలేద్దామా అంటే మనసు ఒప్పుకోవడం లేదు. చేసేదిలేక కలుపు తీసేందుకు తన ఇద్దరు కుమారుల సాయం తీసుకున్నాడు. వారినే కాడెద్దుల్లా మార్చాడు. పుస్తకం పట్టి చదువుకోవలసిన బిడ్డలు ఇలా కాడె పడుతుంటే మనసు చివుక్కుమన్నా శార్ధనప్పకు తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు కార్తీక్ ఇంటర్ చదువుతున్నాడు. రెండో కుమారుడు రాణా ప్రతాప్ పదో తరగతి చదువుతున్నాడు. పని పూర్తి అయిన తర్వాత వారిని చదువుకు పంపించాడు. 

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం

వీరిద్దరితో శార్ధనప్ప తన టమోటా పంటలో పెరిగిన కలుపు మొక్కలు తీయించాడు. స్థానిక రైతులు వారి వీడియో ఫోటోలను తీశారు. ఇవి అనంతపురం జిల్లాలోని రైతుల కష్టాలకు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

Anantapur News: కాడెడ్లుగా మారిన చిన్నారులు - కంటనీరు పెట్టించే అనంతరైతు కష్టం
ఆపన్న హస్త అందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే : 

చిన్నారులు పొలంలో కలుపు నివారణకు తండ్రితోపాటు కాడెడ్లుగా మారి  చిత్రాలు చూసినా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. వెంటనే ఇద్దరు చిన్నారులను తాను చదివిస్తానని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు కూడా తానే భరిస్తానని ఎమ్మెల్యే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget