(Source: ECI/ABP News/ABP Majha)
Anantapur: యువత తప్పుదోవ పడుతుందని ఎవరన్నారు ? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి యువకులు ఎందరో..
ప్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడమే కాదు.అవసరమైతే కుటుంబం కోసం వారి బాగు కోసం తల్లిదండ్రులు చేసే పనిలో కలిసి చేస్తూ కుటుంబానకి అండగా ఉంటోంది నేటి యువత
యూత్ అంటే ఫ్రెండ్స్‌తో టైంపాస్ చేసే వాళ్లు అని కొందరు భావిస్తుంటారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఈ కాలం యువత తమ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తుందని చెబుతుంటారు. కానీ యువత అంటే పది మంది మెచ్చేటోడు అంటోంది అనంతపురం యువ. ప్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, వారితో కలిసి ఆడటం, పాడటం... తిరగడమే కాదు సమయం దొరికినపుడు తల్లిదండ్రులకే కాదు సమాజానికి కూడా తోచినంత సాయం చేస్తోంది.
అనంతపురం రెండో రోడ్‌లో వెంకటరత్నం అనే వ్యక్తి తోపుడుబండి మీద టిపిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయమే ఆయన, ఆయన భార్య టిఫిన్ చేసి పెట్టి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆయన కుమారుడు జేఎన్‌టీయూ అనంతపురంలో ఎంసీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసిన శంకర్ బాగా చదవడమే కాకుండా, క్యాంపస్ లో సీటు కొట్టాడు.
జాబ్ రాగానే గర్వం తానేదో సాధించినట్లుగా చేయకుండా ఇప్పటికీ అవసరం ఉన్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి తమ టిపిన్ సెంటర్లో ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తూ అందరిలో ఆచోచన రేకెత్తిస్తున్నాడు.
యువత తప్పు దోవ పడుతుంది అని ఎవరన్నారు ? అది నిజం కాదు అందుకు అనంతపురానికి చెందిన శంకర్ ఓ ఉదాహరణ. వెంకటరత్నం అనంతపురం నగరంలోని రెండో రోడ్ చివరన ఓ తోపుడు బండిలో టిఫిన్ సెంటర్ నడుపుతుంటారు. ఆయన కుమారుడే శంకర్. తాను ఇంకా చదువుకుంటునే తన తండ్రికి సహాయపడాలని ప్రతిరోజూ తండ్రితో పాటు ఉదయం బండి వద్ద పని చేస్తుంటాడు. శంకర్ ఇటీవల మెరిట్ లో జేఎన్‌టీయూలో ఎంసీఏ సీటు సంపాదించాడు. మీ స్నేహితులు ఎవరైనా నిన్ను
ఇలా రోడ్డులో మీ స్నేహితులు, బంధువులు నిన్ను టిఫిన్ అమ్ముతూ చూస్తే నీకు నామోషీ కాదా? అని అడిగితే.. " మా నాన్నకు నేను సహాయ పడటం కన్న మంచి విషయం ఏముంటుంది. దానికి నామోషీ ఎందుకు? మేము ఒక కుటుంబంగా కలసి కష్టపడుతున్నాము. టిఫిన్ సెంటర్ నడుపుతూనే తండ్రి తనను చదివించారని తెలిపాడు. అది చూసి ఎవరైనా నా స్నేహితులు సిగ్గు పడితే వాళ్ళు నా స్నేహితులు కాదు. అయిన నేను ఎంత పెద్ద చదువు చదివినా ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా నేను మాత్రం మా నాన్నకు సహాయ పడుతూనే ఉంటాను. వెంకట్ రత్నం అబ్బాయి అని అని గర్వంగా చెప్పుకుంటాను
ఇది మన అనంత యువత అని స్థానికులు అంటున్నారు. ఫ్రెండ్స్‌తో సరదాగా తిరుగుతున్నా కుటుంబ విలువలు, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి చేదోడువాదోడుగా నిలిచేవారు కచ్చితంగా జీవితంలో పైకి వస్తారని పెద్దలమాట నిజం చేస్తానని నమ్మకం. అనంతపురంలో శంకర్ లాంటి యువకులు తెలుగు ప్రాంతాల్లో చాలా మంది ఉంటారు. వీలుంటే వారికి సహాయం చేస్తే సమాజానికి మేలు చేసినవాళ్లు అవుతారు.
Also Read: AP PRC Issue: పీఆర్సీపై చర్చలు విఫలమైనట్లే... సమ్మె సైరన్ మోగిస్తాం... ఉద్యోగ సంఘాలు స్పష్టం
Also Read: Name Astrology: మీ పేరు 'R'తో ప్రారంభమైందా..మీపై పెత్తనం చేయడం ఎవ్వరికీ సాధ్యం