అన్వేషించండి
నల్లా కోసం అని చెప్పి పెద్ద ఎత్తున తవ్వకం చేపట్టిన దుండగులు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతోంది. రాకాసిపేట్ శాంతినగర్ ప్రాంతంలో ఓ ఇంటి సమీపంలో కొందరు వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన స్థానికులు తవ్వకాలపై ప్రశ్నించారు. నల్లా కోసం అని చెప్పి పెద్ద ఎత్తున తవ్వకం చేపట్టారు. తవ్విన మట్టిని సుమారు తొమ్మిది మంది వాహనం లో తరలించారు. అక్కడ పూజాసామాగ్రి ,ఇతర వస్తువులు కనిపించడం తో కాలనీ వాసులు అడ్డుకున్నారు. మేక ను గుంత లో వేస్తామని కొందరు చెప్పినట్లు కాలనీ వాసి తెలిపారు. తమ 11 ఏళ్ల పాపను ఆడుకోవడానికి ఇక్కడికి రమ్మని చెప్పినట్లు కాలనీ వాసి తెలిపారు. తవ్వకాలు చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















