Fight Between TRS, BJP Leaders: ఇదెక్కడి అన్యాయమంటున్న నేతలు | Yellareddy peta | ABP Desam
Rajanna Sircilla District Yellareddypeta Mandal Police Station వద్ద TRS, BJP పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం చేటుచేసుకుంది. కంప్లయింట్ ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ పార్టీ నేతలపై తెరాస పార్టీకి చెందిన 200 మంది నాయకులు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి దాడి చేశారంటూ ఆరోపించారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దాడి దృశ్యాలను వీడియో తీస్తుంటే వారి ఫోన్లను పగలగొట్టారన్నారు. ఘర్షణలో గాయపడిన బీజేపీ నాయకులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమపై దాడికి దిగిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. పార్టీ పనులు బాగా చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి మరీ తెరాస పార్టీ నేతలు కొట్టారంటూ కమలం పార్టీ నాయకులు ఆరోపించారు.





















