ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ కి జ్యోతి ప్రజల్వన చేసిన సీఎం రేవంత్
Revanth Reddy speech in ABP Southern Rising Summit 2024: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ కి జ్యోతి ప్రజల్వన చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ABP Southern Rising) అనంతరం మాట్లాడారు. ‘‘మోదీ గారు మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు? నేను సవాలు విసురుతున్నా. ఈ దేశ ప్రజల కోసం ఏ రివల్యూషన్ తీసుకొచ్చారు? (The Southern Rising Summit 2024) మీ పార్టీ దేని కోసం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం నడిపేందుకు మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నారు. రైతులను పట్టించుకోవడం లేదు. నార్త్ ఇండియా నుంచి ఎవరైనా ప్రధాని అయితే రాష్ట్రపతి పదవి దక్షిణాది వారికి ఇచ్చే సాంప్రదాయం కాంగ్రెస్ హాయాంలో ఉండేది. బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటిది లేదు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. పటేల్ విగ్రహంలా... బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని ,బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం. దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి?’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.