KTR Comments: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు - కేటీఆర్
‘నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి డ్రామా ఆడుతున్నారు. బండి సంజయ్ కి భద్రత ఇచ్చి మరీ ర్యాలీ చేయించారు. నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్ ను చర్చలకు పిలిచినా లాభం ఉండదు. ఆయన ఏం చదువుకున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే ఆయనకు తెలుసు’’ అని కేటీఆర్ మాట్లాడారు.
అంతకుముందు ఇస్బాకాన్ (ISBACON-2024) సదస్సులో కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు సుత్రాలతో నగరంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ ను నిర్మించామన్నారు. తార్నాకలోని సీసీఎంబీ లో జరిగిన ఇస్బాకాన్ (ISBACON-2024) సదస్సుకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించటమే సరైన మార్గమని తాను భావించానని చెప్పారు. యంగ్ టాలెంట్ కు సరైన ఆర్థిక వనరులను కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకంతో టీ హబ్ ను ఏర్పాటు చేశామన్నారు.