అన్వేషించండి
MAA Elections: టాలీవుడ్‌లో ప్రాంతీయవాదం రెచ్చగొడతారా?.. హీరో శ్రీకాంత్ ఆగ్రహం
‘మా’ ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న హీరో శ్రీకాంత్.. విష్ణు ప్యానెల్ సభ్యులపై మండిపడ్డారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల కిందటే ప్రకాష్ రాజ్ నా దగ్గరకు వచ్చారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లను కలుపుకుని వెళ్తావు అని అన్నారు. ఇందుకు నేను గత ప్రెసిడెంట్ల కంటే భిన్నంగా నువ్వు ఏం చేస్తావని అడిగాను. ఇందుకు ఆయన చెప్పిన సమాధానం నచ్చింది’’ అని శ్రీకాంత్ అన్నారు.
వ్యూ మోర్





















