(Source: ECI/ABP News/ABP Majha)
నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?
1947 ఆగస్టు 15 న భారత్ కు స్వాతంత్రం వచ్చిన నిజాం రాజ్యం మాత్రం భారత్లో కలవలేదు. సొంత రాజ్యంగా హైదరాబాద్ ను ఉంచడానికే ఆఖరి నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రయత్నించాడు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య తీసుకోవడం సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్య సాహసాలకు నిజాం లొంగిపోవడం జరిగిపోయాయి. అయితే స్వతంత్ర దేశంగా నిజాం రాజ్యాన్ని ఉంచాలని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పై అంత వత్తిడి తీసుకొచ్చిన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వి ఆ తర్వాత ఏమయ్యాడు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన కథ. నిజాం సైన్యంలో ఉంటూ రజాకారులు సాగించిన అరాచకాలు అన్ని ఇన్నీ కావు. వాటిని కథలు కథలుగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు. అకాల మరణం పాలవ్వడంతో మజ్లిస్ కు కొత్త నాయకుడిగా కాసిం రజ్వి ఎదగాలని చూశాడు. అప్పటి మజ్లిస్ లోని అంతర్గత పోరాటాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో లాతూర్లోనే తన సొంత పార్టీగా మజ్లిస్ ఈ ఇషా నిజాం ఓ నస్క్ అనే పార్టీని స్థాపించాడు. ఈలోపు 1946 లో మజ్లిస్ పార్టీలో జరిగిన గొడవలు నిజాం తో వచ్చిన విభేదాల కారణంగా మజ్లిస్ లీడర్ గా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చక్రం తిప్పిన కాసిం రజ్వి మజ్లిస్ కి కూడా నాయకుడయ్యాడు. విచిత్రంగా అప్పటివరకు కొంత ఉదారవాదిగా పేరున కాసిం రజ్వి ఒక్కసారి మజ్లిస్ నాయకుడు అయ్యాక ఛాందసవాదిగా మారిపోయాడు అంటారు చరిత్రకారులు. దానికి కారణం అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పదని తెలియడం మరోవైపు హైదరాబాద్ ఇండియాలో విలీనం చేసి తీరతారనే నమ్మకం ప్రజల్లో చర్చలా జరిగేది. నిజానికి నిజాం రాజ్యం ప్రజలు కూడా కోరుకున్నది అదే అయితే దీన్ని కాసిం రజ్వి తట్టుకోలేకపోయాడు. అధికారం అంటూ ఉంటే తమదే అని బలంగా భావించిన కాసిం ఒక ప్రత్యేక మిలీషియా దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే రజాకార్. దాని అర్థం స్వచ్ఛందంగా చేరిన కార్యకర్తలు అని హైదరాబాద్ రాజ్యం బయట నుంచి అంటే ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ బృందాలను రాజ్యంలో ఎదుగుతున్న కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికే ఈ రజాకారులు అని కాసిం సమర్ధించుకున్న వారు సామాన్య జనంపై కూడా దాడులు చేసేవారనేది తెలంగాణ చరిత్ర చెబుతుంది. తమకు ఎదురు తిరిగిన వారిని పూర్తిగా అంచివేయడానికి రజాకార్ దళాన్ని వాడేవారట రజ్వి వీరి సంఖ్య లక్షల్లో ఉండేదని రజ్వి చెప్పేవారు తరచుగా కాకీ బట్టలు ఆయుధాలు. ధరించి హైదరాబాద్ రాజ్యంలో ఎదేచ్చగా తిరిగేవారని నిజాం పోలీస్ బృందాలు కూడా వారు చేసే అరాచకాలను చూస్తూ ఉండిపోయేవారని నాటి ప్రజలు ఆ చీకటి రోజులను నేటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈలోపు హైదరాబాద్ తో ఢిల్లీ చర్చలు సఫలం కాకపోవడంతో 1948 సెప్టెంబర్ లో పోలీస్ చర్య మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. పర్వాలేదు మనమే గెలుస్తాం అంటూ కాసిం రజ్వి లేనిపోని భరోసా నిజాం కు కలిగించి యుద్ధానికి కూడా సిద్ధపడేలా చేశాడు. కానీ భారత సైన్యం నిజాం రాజ్యంలో అడుగు పెట్టగానే ప్రజల నుంచి వారికి వచ్చిన మద్దు చూసి రజాకారులు తోక ముడిచారు. ఎక్కడికక్కడ భారత సైన్యానికి లొంగిపోవడం లేదా పారిపోవడం లాంటివి చేశారు. దీంతో దిక్కు తోచని కాసిం రజ్వి రేడియో ద్వారా ప్రజలతో ఆఖరిసారి మాట్లాడి లొంగిపోయాడు. హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైన తర్వాత కాసిం రజ్వి నాయకత్వంలోని రజాకారులు చేసిన దురాగతాలు స్వయంగా రజ్వి పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది. అయితే రజాకార్లలో అరాచక మూకలు చేరిపోయాయని వారిని రజ్వి అదుపు చేయలే. వయసు సహకరించలేదు. చివరకు అనామకుడిగా 1970 లో కరాచీలో మరణించాడు కాసిం రజ్వి. హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపాలని లేదా స్వతంత్ర దేశంగా ఉంచాలని వెర్రి ఆలోచనలతో, చాందస భావాలతో ఎన్నో దారుణాలకు తెగబడ్డ రజాకార్ల మోఖ నాయకుడు కాసిం రజ్వి చరిత్ర అలా ముగిసిపోయింది.