What is Bronco Test ? | బ్రాంకో టెస్ట్ అంటే ఏంటి ?
మ్యాచులు ఆడాలంటే క్రికెటర్లకు ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. సరైన ఫిట్నెస్ లేకపోవడంతో చాలామంది ప్లేయర్స్ టీం లో సెలెక్ట్ కూడా అవ్వరు. అయితే ప్లేయర్స్ ఫిట్నెస్ ని మరింత పెంచడానికి బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే బ్రాంకో టెస్ట్. ఇకపై ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్ ను తప్పనిసరి చేసింది. బ్రాంకో టెస్ట్ ను రగ్బీ గేమ్ లో ఉపయోగించే ఫిట్‌నెస్ టెస్ట్. ఏరోబిక్ కెపాసిటీ, స్టామినా, ఫిట్‌నెస్ పెంచడంలో ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ టెస్టును కెలవం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ బ్రాంకో టెస్ట్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. మొదట ఒక ప్లేయర్ 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. ఆ తర్వాత 40 మీటర్స్, 60 మీటర్స్ పరుగెత్తాలి. మొత్తం 240 మీటర్లు. ఇదంతా కలిపి ఒక సెట్ గా పరిగణిస్తారు. ఇలాంటివి ఒక ప్లేయర్ 5 సెట్స్ పూర్తి చేయాలి. అంటే 1200 మీటర్లు. ఇదంతా కూడా కేవలం 6 నిమిషాల్లో పూర్తి చేయాలి.
ఇండియా టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆండ్రియన్ లే రాక్స్ ఈ బ్రాంకో టెస్ట్ ను సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఒకే చెప్పడంతో చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి ఈ టెస్ట్‌ను పూర్తి చేశారట.





















