Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్య ?
టీమ్ ఇండియా స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళి స్క్వాడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా గేమ్ కు దూరంగా ఉన్న పాండ్యా... ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్స్ లో బౌలింగ్ చేయడానికి కావాల్సిన ఫిట్‌నెస్‌ను సాధించినట్లు బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది. నేషనల్ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ ను పూర్తి చేసుకున్నాడు.
ఆసియా కప్ సెమీ-ఫైనల్‌లో పాండ్యాకు ఎడమ తొడ కండరంలో గాయం అయింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఇంటెర్నేషన్ క్రికెట్ కు ముందు హార్దిక్ దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ తన సొంత టీమ్ అయిన బరోడా తరఫున ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తోలి టోర్నమెంట్ కాబట్టి.. హార్దిక్ బౌలింగ్ చేసిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో అన్నది బీసీసీఐ సమీక్షించనుంది. కాబట్టి ఈ టోర్నమెంట్ హార్దిక్ కు చాలా కీలకంగా మారనుంది.





















