Surya Kumar Yadav Weight loss | కప్పు కోసం కొవ్వు కరిగించుకున్న సూర్యకుమార్ యాదవ్
టీ20 వరల్డ్ కప్పు కోసం ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మిస్టర్ 360 అనిపించుకున్న సూర్యకుమార్ యాదవ్ ఎన్నడూ లేనంత ఫిట్ గా తయారయ్యాడు. ఐపీఎల్ కంటే ముందు నుంచీ స్ట్రిట్ గా డైట్ లో ఉన్న సూర్య కుమార్ రెండు నెలల్లో 15కిలోల బరువు తగ్గిపోయాడు. అందులో 13కిలోల కొవ్వును కరిగించుకున్నట్లు స్క్రై ఫిట్ నెస్ ట్రైనర్ తెలిపారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో చీలమండకు సర్జరీతో మొదలుపెట్టి ఆరునెలల్లో మూడు ఆపరేషన్లు చేయించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. NCA లో ట్రైనింగ్ తీసుకుని ఐపీఎల్ ఆడిన తర్వాత ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కి ముందు ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. సూర్య బాగా సన్నబడిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిన్న బంగ్లా దేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో సూర్య న్యూ లుక్ కనిపించింది. డైట్ కోసం అన్న తినటం మానేశాడంట సూర్య. గోధుమలతో కాకుండా ఇతర పిండితో చేసిన రొట్టెలు తిన్నాడు. ప్రోటీన్లు అధికంగా లభించే గుడ్లు, మాంసం, చేపలు తీసుకున్నాడట. డైరీ ప్రొడెక్ట్స్ జోలికి పోకుండా. .కూరగాయలు, నట్స్, అవకాడోను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా సూర్య 15కిలోల బరువు తగ్గాడని బరువు తగ్గేందుకు సూర్యతో కలిసి పనిచేసిన పోషకాహార నిపుణురాలు శ్వేత భాటియా మీడియాకు చెప్పటంతో ఈ విషయం బయటకు వచ్చింది.