Shubman Gill Virat Kohli Record Break | కింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రిన్స్
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టెస్ట్ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసాడు. భారత్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డ్ సృష్టించాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక రన్స్ సాధించిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును శుభమన్ గిల్ అధిగమించాడు.
గిల్ పై కింగ్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. గిల్‌ను ‘స్టార్ బాయ్’ అని అభివర్ణించాడు విరాట్ కోహ్లీ. "Well Played Star Boy... Rewriting History.. You Deserve This " అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ ని కింగ్ పొగిడారు. కెప్టెన్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత ఇలా రికార్డు బ్రేక్ చేయడం అంటే శుభమాన్ గిల్ కెరీర్‌లో ఒక మైలురాయి అనే చెప్పాలి. ఈ మ్యాచ్ తో ... సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసాడు గిల్.





















