Sanju Samson Performance as Opener | ఓపెనర్‌గా సెంచరీలు చేస్తున్న సంజూ శాంసన్
ఆసియా కప్ దగ్గరపడుతున్న కొద్దీ సంజూ శాంసన్ తన గేమ్ లో దూకుడు పెంచుతున్నాడు. ఆసియా కప్ స్క్వాడ్‌లో సెలెక్ట్ అయినప్పటికీ కూడా.. సంజును ప్లేయింగ్ 11 లో సెలెక్ట్ చేస్తారా లేదా అన్న డౌట్ ఉంది. దాంతో తన గేమ్ తోనే ఆ డౌట్స్ ను క్లియర్ చేస్తున్నాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు.
చివరి మూడు మ్యాచ్‌లలో సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు చేసాడు. ఆసియా కప్ స్క్వాడ్ లో చూసుకుంటే శుబ్మన్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ... వీరిలో ఇద్దరికీ ఓపెనర్ గా ఛాన్స్ రావొచ్చు. శుబ్మన్ గిల్ ఈ టోర్నమెంట్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. దాంతో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ... స్థానం ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో ఎవరికో ఒక్కరికే అవకాశం ఉండొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి టైం లో ఓపెనర్ గా తాను ఉన్నానని సంజు ఇన్ డైరెక్ట్ గా తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తున్నాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తనను తాను నిరూపించుకుంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్‌లో సంజూ శాంసన్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడా? లేడా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.





















