Rohit Sharma in The Oval Ground | ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ
ఇంగ్లాండ్‌తో లండన్‌లోని ఓవల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ చేశాడు. అయితే సెంచరీ తర్వాత జైస్వాల్ తనదైన స్టైల్ లో గాల్లోకి ఎగిరి, గ్యాలరీని చూస్తూ ముద్దులు ఇచ్చాడు. ఆ తర్వాత లవ్ సింబల్ చూపించాడు. వెంటనే ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జైస్వాల్ లవ్ సింబల్ ఎవరికీ చూపించాడు అంటూ అందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ మ్యాచ్ జరిగే టైంలో జైస్వాల్ తల్లిదండ్రులు కూడా స్టేడియంలోనే ఉన్నారు. వారి కోసమే జైస్వాల్ ఆలా చేసి ఉంటాడని కూడా అందరు అనుకున్నారు. కానీ ఈ సెంచరీని రోహిత్ శర్మకు అంకితం చేస్తూ జైస్వాల్ భావోద్వేగానికి లోనయ్యాడు.
మ్యాచ్ తర్వాత జైస్వాల్ మాట్లాడుతూ... గ్యాలరీ నుంచి నాకు రోహిత్ శర్మ ఒక మేసేజ్ కూడా పంపించాడని అన్నాడు. అందుకే, ఈ మ్యాచ్ లో సెంచరీ చేసానని అని పేర్కొన్నాడు. గ్యాలరీలో ఉన్న రోహిత్ భాయ్ ని నేను చేశాను.. అప్పుడు తాను నాకు సిగ్నల్ ఇచ్చాడు. ఆటను కొనసాగించమని నాకు సూచించాడు.. అందుకే, ఆచి.. తూచి ఆడుతూ.. సెంచరీ చేసానని జైస్వాల్ వెల్లడించారు.




















