![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP Desam
ఐపీఎల్‌లో ఆర్సీబీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఒక దశలో టోర్నమెంట్ నుంచి అన్నిటికంటే మొదటిగా నిష్క్రమించేలా కనిపించిన ఆర్సీబీ అన్నిటికంటే ఆఖరున ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. మొదటి 8 మ్యాచ్‌ల్లో 7 ఓడిన ఆర్సీబీ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఏవో చూద్దాం.
1. బెంగళూరు సూపర్ బ్యాటింగ్ - కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు తమ సత్తా చూపించారు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు వేగంగా ఆడారు. కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 47 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ కొంచెంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
2. రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్ - ఈ సీజన్‌లో చెన్నై తరఫున టాప్ స్కోరర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. కానీ అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో రుతు మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. అది టీమ్ మీద గట్టి ఇంపాక్ట్ చూపించింది.
3. పెద్ద దెబ్బ కొట్టిన దూబే - ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో శివం దూబేకు అందరి కంటే ఎక్కువ హీట్ తగులుతుంది. ఈ సీజన్‌లో అత్యద్భుత ప్రదర్శన చేసిన దూబే కీలకమైన ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే కొట్టగలిగాడు. దీనికి తోడు శివం దూబే సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల 37 బంతుల్లో 61 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన రచిన్ రవీంద్ర రనౌట్ అయ్యాడు.
4. ఆఖర్లో ఆదుకున్న ధోని, జడేజా - ఒక దశలో లక్ష్యానికి చాలా దూరంగా కనిపించిన సీఎస్కే... ధోని, జడేజాల బ్యాటింగ్‌తో టార్గెట్‌కు చాలా దగ్గరగా వచ్చింది. కానీ చివరి ఓవర్లో ధోని అవుట్ కావడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. జడేజా 22 బంతుల్లో 42 పరుగులు, ధోని 13 బంతుల్లో 25 పరుగులు సాధించారు.
5. ప్లేఆఫ్స్ బెర్త్‌లు అన్నీ ఫిక్స్ - ఈ మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ బెర్తులు అన్నీ ఫిక్సయ్యాయి. టాప్-4లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ ఉన్నాయి. కానీ ఈ ఆర్డర్ మారే అవకాశం ఉంది.
![Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/03/96d7da59cc3d61c8ff606ee47b80d1c01735872916749310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Rohit Sharma Virat Kohli BGT Australia Tour | టీమ్ కు భారమైనా రోహిత్, కొహ్లీలను భరించాలా.? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/02/9b5b51e67beff23cc937a317c5a32b231735839019522310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/01/6f4c4b91ea58a2cacef7038dbc8c7ff71735750080205310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Gautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/01/ec1191041bc3424702e73fb39a76b45e1735749919308310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి.. ఎమోషనల్ వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/29/c38f125cca0675abdf1de2888c6adbbc1735462381411234_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)