(Source: ECI/ABP News/ABP Majha)
SRH Allout For 113 in Finals | ఫైనల్లో 113కే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్ | ABP Desam
ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు బోల్తా కొట్టారు. కీలకమైన మ్యాచ్‌లో ఎవరూ 25 పరుగులు కూడా చేయలేకపోయారు. కేవలం 18.3 ఓవర్లలో 113 పరుగులకే చాప చుట్టేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్స్‌లో ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. కెప్టెన్ కమిన్స్ చివర్లో చేసిన 24 పరుగులే అత్యధిక స్కోరు అంటే అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో. టాస్ గెలవగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది. అనంతరం మైక్ తీసుకున్న కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాక్కావాల్సింది కూడా అదే అన్నాడు. ఆన్ గ్రౌండ్‌లో ప్లాన్స్ అన్నీ కేకేఆర్ బౌలర్స్ చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ అగ్రెసివ్ బ్యాటింగ్ మంత్రాన్ని మొదటి నుంచి నమ్ముకున్న సన్‌రైజర్స్‌ను ఫైనల్లో అదే స్ట్రాటజీ ముంచేసింది. విధ్వంసకర టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ కలిసి చేసిన పరుగులు 11 మాత్రమే. తర్వాత వచ్చిన వారు పరిస్థితికి తగ్గట్లు ఆడే ప్రయత్నం చేయలేదు. పార్ట్‌నర్‌షిప్స్ కూడా బిల్డ్ చేయలేకపోయారు. నాలుగో వికెట్‌కు నితీష్ కుమార్ రెడ్డి, ఎయిడెన్ మార్క్రమ్ జోడించిన 26 పరుగులో ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. కోల్‌కతా బౌలర్లలో బంతి పట్టుకున్న ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కింది. ఆండ్రీ రసెల్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. రూ.24.75 కోట్లు తీసుకున్న మిషెల్ స్టార్క్ 4.7 ఎకానమీతో బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. మరి రైజర్స్ బౌలింగ్‌లో ఏమైనా మెరుపులు మెరిపిస్తుందేమో చూడాలి.