Sunrisers Hyderabad Playoff Scenario | సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆడాలంటే ఇక అద్భుతం జరగాల్సిందే
నిన్న గుజరాత్ టైటాన్స్ మీద తప్పనిసరిగా గెలిస్తే కానీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోలేమని తెలిసినా మ్యాచ్ ఓడిపోయింది మన ఆరెంజ్ ఆర్మీ. గుజరాత్ విసిరిన 225పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 186పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ తప్ప పోరాడటానికి మరొకరు నిలబడకపోవటంతో సన్ రైజర్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా కనిపించలేదు. ఫలితంగా 38 పరుగుల తేడాతో మ్యాచ్ ను గుజరాత్ చేతుల్లో పెట్టింది సన్ రైజర్స్. అయితే సన్ రైజర్స్ కు ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు క్లోజ్ అయిపోలేదు. ఓ అద్భుతం జరిగితే ఆరెంజ్ అర్మీ అస్సాం ట్రైన్ ఎక్కే పని ఉండదు. అందేటంటే పాయింట్స్ టేబుల్ లో టాప్ 3లో ఉన్న జట్లు ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్నాయి. సన్ రైజర్స్ కి ప్రజెంట్ ఉన్న పాయింట్లు 6. SRH చేతిలో ఇంకా 4 మ్యాచులు ఉన్నాయి. ఈ నాలుగు భారీ గా నెట్ రన్ రేట్ పెంచుకునేలా ప్లాన్ చేసుకుని ఆడితే సన్ రైజర్స్ కి 14 పాయింట్లు వస్తాయి. అదే సమయంలో పాయింట్స్ టేబుల్ టాప్ 3 కాకుండా ఉన్న పంజాబ్, ఢిల్లీ, కోల్ కతా, లక్నో జట్లు మ్యాచ్ లు గెలవకూడదు. పంజాబ్ అయితే అస్సలు గెలవకూడదు. గెలిచిందా అంటే ఇక ఆ క్షణమే SRH అస్సాం ట్రైన్ ఎక్కేందుకు బ్యాగ్ లు సర్దేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓటమితో ఆల్రెడీ GT టీటీలా మారి టికెట్ ఇచ్చేసింది కాబట్టి.





















